Bandla Ganesh : కమెడీయన్ నుండి నిర్మాతగా ఎదిగి ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు బండ్ల గణేష్. ఆయన ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూనే ఉన్నాడు. ఆయన స్పీచ్ ఇచ్చే సమయంలోను లేదంటూ సోషల్ మీడియాలోను ఏం చెప్పాలనుకున్నాడో అది సూటిగా చెప్పేయడం వలన హాట్ టాపిక్ అవుతుంటాడు. అయితే తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్లు మరోసారి సంచలనంగా మారాయి. ఎవరిని ఉద్దేశించి పెట్టాడో తెలియదు గానీ, వాటిపై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నాయి.
`జీవితం చాలా చిన్నది. ప్రతి ఒక్కరికి ఒక్కటి మాత్రం చెబుతున్నా. దయజేసి ఎవరిని నమ్మోదు.. ఎవ్వరూ మనకు సహాయం చేయరు. ఎవరూ మనను ఆదుకోరు. వీలైతే బ్రహ్మాండంగా మోసం చేస్తారు. బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు. వాడుకున్న తర్వాత మళ్లీ పక్కన పడేసి ఇంకో ఆడుకునే వస్తువు వస్తుంది . ఆ బొమ్మతో ఆడుకుంటారు. ఆడుకునే వాడు ఒక్కడే, కానీ మనల్ని ఆడుకునే బొమ్మలు చాలా ఉంటాయి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఎవరినైనా నమ్మామా, మన గొంతు మనం కోసుకున్నట్టే. ప్లీజ్ మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. మీ శక్తి సామర్థ్యాలను మాత్రమే నమ్మండి. మీ శక్తితో మీరు పోరాడండి, ఎంత పెద్దోదైనా గౌరవించండి, కానీ మనకు సహాయం చేస్తారని మాత్రం ఆశించకండి` అంటూ బండ్ల గణేష్ హితభోద చేశాడు.
![Bandla Ganesh : పవన్ కళ్యాణ్‌ని బండ్ల గణేష్ అంత మాట అన్నాడా.. మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం.. Bandla Ganesh controversial comments on pawan kalyan fans unhappy](http://3.0.182.119/wp-content/uploads/2022/12/bandla-ganesh-1.jpg)
అయితే ఇది ఎవరిని ఉద్దేశించి పెట్టాడో తెలియదు కాని, ఆయనపై పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతుండటం గమనార్హం. నిన్ను వాడుకున్నది ఎవరు, `గబ్బర్ సింగ్ స్పెషల్ షోస్ వేయమంటే యాభై వేలు అడిగావ్ .., ఫ్యాన్స్ తో ఆడుకునేది ఇలానేనా? నీయంత వెర్రి పుష్పం ఎవరు ఉండరులే అని, నిన్ను ఎవరైనా వాడుకుంటారా అది సాధ్యమేనా? అంటూ పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు.ఇక వైసీపీ ఫ్యాన్స్ కూడా ఈ డిస్కషన్‌లో పాల్గొని రచ్చ చేస్తున్నారు. పవన్, బాబులనే బండ్ల గణేష్ అన్నదని చెప్పుకొస్తున్నారు. ఒకప్పుడు పవన్‌ని ఆరాధ్య దైవంగా భావించిన బండ్ల గణేష్.. ఇటీవల ఆయనకు దూరంగా ఉంటున్నట్టు అర్ధమవుతుంది.