Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లలో సమంత ఒకరు. ఫిట్నెస్ అంటే ప్రాణం ఇచ్చే సమంత ఆ మధ్య మాయోసైటిస్ వ్యాధి బారిన పడినప్పుడు, అంతకు ముందు, ఆ తర్వాత కూడా… ఆరోగ్యం ఎలా ఉన్నా వర్కవుట్స్ చేయడం, జిమ్‌కు వెళ్ళడం మానలేదు. షూటింగుల్లో ఉన్నా షెడ్యూల్ ప్రకారం సమంత జిమ్ చేయాల్సిందే. ఒకటి… రెండు… మూడు… వంద! లెగ్స్ స్ట్రెంగ్త్ కోసం సమంత ఓ వ్యాయామం చేశారు. బాడీ వెయిట్ అంతా మోకాళ్ళ కింద భాగంలో పడేలా పాదాలను పైకి కిందకు కదిలిస్తారు. అంత ఇంటెన్స్ వర్కవుట్స్ సమంత చేయడం చూసి అందరూ షాక్ అవుతున్నారు. మాయోసైటిస్ నుంచి కోలుకుంటున్న తరుణంలో ఆమె ధైర్యాన్ని, తెగింపును చూసి ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెబుతున్నారు.
సమంత శ్రమిస్తున్న తీరు చూసి అయ్యో పాపం అంటున్న వాళ్లు కొందరైతే.. అబ్బా ఎంత కష్టపడుతుందిరా బాబూ.. ఈ మాత్రం చేస్తుంది కాబట్టే ఆ రేంజ్ ఫిట్‌గా ఉందంటున్నారు మరికొందరు. మయోసైటిస్ బారిన పడిన తర్వాత సమంతలో చాలా మార్పులు వచ్చాయి. దానికి ముందే విడాకులతో మానసికంగా కృంగిపోయిన స్యామ్‌కు మయోసైటిస్ మరింత దెబ్బ తీసింది అని చెప్పాలి. తాను మెంటల్‌గా చాలా వీక్ అయిపోయానని.. అందుకే ఓ సమయంలో రోజుల తరబడి ఏడుస్తూనే కూర్చున్నానని.. ఒంటరిగా నరకం చూసానని చెప్పింది ఈ బ్యూటీ. ఆరోగ్య సూత్రాలను కూడా తూచా తప్పకుండా పాటిస్తుంది. దానికి తోడు ఫుడ్ విషయంలోనూ చాలా మార్చుకుంది సమంత.
తన డైట్ చూసి అందరూ షాక్ అవుతున్నారు కూడా. మయోసైటిస్ కారణంగా కోల్పోయిన ఇమ్యూనిటీ పవర్ తిరిగి తెచ్చుకుంది. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత ఒంటరిగానే ఉంటుంది సమంత. ఈమె రెండో పెళ్లిపై ఆ మధ్య వార్తలు బాగానే వినిపించినా.. అలాంటిదేం లేదని.. అందులో నిజం లేదని తేల్చేసింది ఈ ముద్దుగుమ్మ. తనకు అలాంటి ఆలోచన కూడా లేదని తేల్చి పారేసింది. అయితే తనకు తల్లి కావాలనే ఉందనే విషయం ఇంతకుముందే చెప్పింది సమంత. ప్రత్యూష ఫౌండేషన్ నుంచి చాలా మంది పిల్లల బాధ్యతను తీసుకుంది సమంత. ఇప్పుడు ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని వాళ్లకు అమ్మ అవ్వాలని సమంత ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక జీవితంలో పెళ్లి అనే మాటకు ఆమె తావివ్వకుండా సమంత ఓ షాకింగ్ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.