Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా చిత్రం ఖుషి. సెప్టెంబర్ 1న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఓ రేంజ్‌లో సాగుతున్నాయి. మంగళవారం (ఆగస్టు 15) రాత్రి హైదరాబాద్‌లో ‘మ్యూజికల్ కన్సెర్ట్’ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో లైవ్ పెర్ఫార్మెన్స్‌తో అభిమానుల్లో జోష్ నింపారు సమంత, విజయ్ దేవరకొండ. ఈవెంట్ లో విజయ్ షర్ట్ తీసేసి సమంతని ఎత్తుకొని చుట్టూ తిప్పుతూ హడావిడి చేస్తూ డ్యాన్స్ చేయడంతో ఈ వీడియోలు, ఫొటోలు వైరల్ గా మారాయి. హీరో హీరోయిన్స్ లా కాకుండా ఈవెంట్స్ కి డ్యాన్స్ లు వేసే డ్యాన్సర్లులా చేశారని, డ్యాన్స్ చేయడానికి విజయ్ షర్ట్ ఎందుకు ఇప్పడం అని కొందరు నెగెటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు.
అయితే విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. సమంత ఎదుర్కొన్న అనారోగ్య సమస్య గురించి ప్రస్తావించారు. సమంత ఎంతో కష్టం భరించింది. తనెప్పుడూ నవ్వుతూ ఉండటం చూడాలి. ఇప్పుడు కూడా తనకు హెల్త్ సపోర్ట్ చేయట్లేదు. తనకు లైట్లు, సౌండ్ ఇదంతా పడవు. వెంటనే తలనొప్పి వస్తుంది. కానీ, మన అందరి కోసం ఇక్కడికి వచ్చింది’ అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. సమంత హెల్త్ గురించి మాట్లాడొద్దని అనుకున్నా. కానీ, ఆమె నుంచి ఎంతో మంది స్ఫూర్తి పొందుతున్న వారికి ఆమె గురించి చెప్పాలి అని విజయ్ అన్నారు. ఇలా ఉన్నా కూడా మన పని మనం చేసుకోవచ్చనేది చెప్పడానికే తను వచ్చింది అని విజయ్ దేవరకొండ అన్నారు.
సమంత మాట్లాడుతూ.. మా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, రవి గారికి థాంక్స్. వారికి థాంక్స్ చెప్పడానికి మాటలు చాలడం లేదు, గత ఏడాది కాలంలో మీరు నా పట్ల చూపించిన సహనం, కేరింగ్ నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని తెలిపింది. మీరు నాకు ఎప్పటికీ ఫెవరేట్ ప్రొడ్యూసర్స్. అలాగే నాకు ఇష్టమైన మనుషులు కూడా.. ఇక డైరెక్టర్ శివ, హీరో విజయ్న్ కి చాలా పెద్ద థాంక్స్ చెప్పాలి. థాంక్ గాడ్ విజయవాడలో సమంత ఇడ్లీ స్టాల్ పెట్టే అవసరం రాలేదు. టైంకు వచ్చి నేను సినిమా ఫినిష్ చేసేశాను, ఎందుకంటే ఈ ఇడ్లీ బిజినెస్ మీరు చేయగలరా లేదా అని డౌట్స్ ఉన్నాయని నవ్వుతూ అంది. మీ ఎనర్జీ చూసి నేను సెప్టెంబర్ ఒకటికి టైమ్ ను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మీతోనే సినిమా చూడాలి అనిపిస్తోంది. ఎప్పుడూ మీకు నచ్చిన ఒక మంచి సినిమా తీయాలనేదే మా ప్రయత్నం. ఈసారి అలాంటి సినిమానే చేశామని నమ్ముతున్నాను. మీకోసమే హార్డ్ వర్క్ చేస్తున్నా, హెల్తీగా తిరిగివస్తా బ్లాక్ బస్టర్ ఇస్తాను అని చెప్పుకొచ్చింది సమంత.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…