Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కొద్ది రోజుల క్రితమే అమ్మనాన్నలుగా ప్రమోషన్ పొందిన విషయం తెలిసిందే. దాదాపు పదకొండేళ్ల తర్వాత వారికి బిడ్డ జన్మించడంతో ప్రతి ఒక్కరు ఫుల్ ఖుష్ అయ్యారు. ఇక ఉపాసన క్లింకార కొణిదెల అనే పండంటి ఆడబిడ్డకు జూన్ 20న జన్మనివ్వగా, జూన్ 30న క్లింకార అనే నామకరణం చేశారు . అయితే చాలామంది సెలబ్రిటీల్లాగానే రామ్‌చరణ్ దంపతులు కూడా తమ గారాల పట్టి ముఖాన్ని బయటకు చూపించడం లేదు. బారసాల ఫొటోలతో పాటు కొన్ని ఇమేజెస్, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినా తమ కూతురు ఫేస్ కనిపించకుండా తగు జాగ్రత్తపడారు చెర్రీ దంపతులు.
అసలు క్లింకార ఎలా ఉంది? తాత చిరంజీవి, తండ్రి రామ్‌చరణ్ పోలికలు వచ్చాయా? అంటూ అభిమానులు రామ్‌చరణ్-ఉపాసన దంపతులను అడుగుతున్నారు .. కొన్నిసార్లు అయితే దయచేసి క్లింకార ఫొటోలు షేర్ చేయండంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉపాసన తాజాగా తన ట్విట్టర్‌లో క్యూట్ పిక్స్ షేర్ చేసింది. తన అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి జెండా పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నపిక్స్ షేర్ చేయగా, ఇందులో క్లింకార ఫేస్ కొద్దిగా మాత్రమే కనిపిస్తుంది. పూర్తి ఫేస్ చూపించాల్సిందిగా అని కొందరు కోరుతున్నారు. అయితే ఇటీవల క్లింకార ఎవరి పోలికలతో ఉందనే దానిపై సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు ఎవరి పోలికలు వచ్చాయో కూడా చెప్పేశాడు. ‘క్లింకారకు తండ్రి పోలికలే వచ్చాయి. అచ్చం రామ్‌చరణ్ లాగే ఉంటుంది. కళ్లైతై చాలా బాగున్నతాయి. నాకు తెగ నచ్చేశాయి. అమ్మాయి తండ్రి పోలికలతో పుడితే అదృష్టమంటారు. క్లింకార విషయంలోనూ అదే జరిగింది’ అని తేజ్ చెప్పుకొచ్చాడు.
ఇక మెగా వారసురాలికి సెలబ్రిటీలు భారీ ఎత్తున కానుకలు పంపించారు. మెగా వారసురాలు క్లింకారకు యంగ్ హీరో శర్వానంద్ స్పెషల్ గిఫ్ట్ పంపించగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన స్నేహితుడి గారాల పట్టికి గోల్డ్ డాలర్స్ కానుకగా ఇచ్చారట. ఇక ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కోడలికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారట. క్లింకార పేరు, పుట్టిన తేదీ తదితర వివరాలు వచ్చేలా బంగారు అక్షరాలతో డిజైన్ చేయించిన పలకను బహుమతిగా ఇచ్చారని సమాచారం. మొత్తానికి క్లింకార స్టార్ సెలబ్రిటీ కాగా, అలా తమకు నచ్చదని తన సొంతంగా గుర్తింపు తెచ్చుకోవాలని ఉపాసన అంటుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…