Samantha : షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ స‌మంత‌.. టెన్ష‌న్‌లో ఫ్యాన్స్..

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత విడాకుల త‌ర్వాత త‌న ఫోక‌స్ మొత్తం సినిమాల‌పైనే పెట్టింది. వెబ్ సిరీస్ లు, సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటూ బిజీబిజీగా గ‌డుపుతుంది. ఈ క్ర‌మంలోనే సమంత షూటింగ్‌లో గాయపడ్డారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో గాయపడ్డట్లు సమాచారం. మోకాలికి గాయం కావడంతో ఆక్యుపంక్చర్ పద్ధతిలో చికిత్స తీసుకుంటున్నది. చికిత్సకు సంబంధించిన ఫొటోను షేర్‌ చేసింది. గాయాలపాలు కాకుండా యాక్షన్ స్టార్‌ను కాగలనా ? అంటూ పోస్ట్‌ చేసింది. అయితే, ఏ మూవీ షూటింగ్‌లో గాయపడింది.. ప్రమాదం ఎప్పుడు జరిగిందనే వివరాలను మాత్రం సమంత వెల్లడించలేదు.

మా ఇంటి బంగారం మూవీ షూటింగ్‌లో గాయపడ్డట్లు తెలుస్తున్నది. సమంత తెలుగులో చివరిసారిగా ఖుషీ మూవీలో విజయ్‌ దేవరకొండ సరసన నటించింది. బాలీవుడ్‌లో హీరో వరుణ్‌ ధావన్‌తో సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నది. ఈ ఏడాది నవంబర్‌ 7 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానున్నది. సిటాడెల్‌ ఇంగ్లిష్ వెర్షన్‌లో ప్రియాంక చోప్రా పోషించిన పాత్రను బాలీవుడ్‌లో సమంత పోషిస్తున్నది. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. స‌మంత గత కొద్ది కాలం వరకు సమంత సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడటంతో ఆమె చికిత్స తీసుకుంటూ విశ్రాంతి తీసుకున్నారు.

Samantha gaya padindi in film making spot
Samantha

తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇటీవలే ఆమె కొంత కోలుకోవడంతో సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అంతేగాక, ఇటీవల క్యాస్టింగ్ కౌచ్ అంశంపైనా ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. ఇటీవ‌ల స‌మంత రెండో పెళ్లికి సంబంధించి నెట్టింట అనేక ప్ర‌చారాలు జ‌ర‌గ‌గా, దానిపై స‌మంత ఇంత వ‌ర‌కు స్పందించింది లేదు.‘శాకుంతలం’ సినిమా తర్వాత కొంతకాలం పాటు ఆమె సినిమాలకు విరామం ప్రకటించింది. పూర్తిగా ఆరోగ్యం మీద ఫోకస్ పెట్టింది. ‘మయోసైటిస్’ కు చికిత్స తీసుకుంది. వ్యాధి నుంచి కాస్త కోలుకున్న సమంత.. విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషీ’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ తర్వాత సమంత సినిమాలకు సంబంధించి పెద్దగా అప్ డేట్స్ లేవు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago