Pawan Kalyan : ప్రస్తుతం ఏపీ ప్రజలు వరదలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.ఇదే సమయంలో కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. విజయవాడ ప్రాంతం వరదలతో కొట్టుకుపోతుంటే తాను కనిపించడం లేదని వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. వరద ప్రభావ ప్రాంతాలకు తాను వెళ్లి పాల్గొంటే సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందని, అధికారులపై ఒత్తిడి పెరుగుతుందన్న ఉన్నతాధికారుల సూచనలతో తాను వెళ్లలేదని స్పష్టం చేశారు. బుధవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన డీసీఎం పవన్ కల్యాణ్ వైసీపీ నాయకుల తీరుపై మండిపడ్డారు.
విపత్తు పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు నాయుడు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఈ వయసులో కూడా సీఎం చంద్రబాబు నాయుడు ట్రాక్టర్లు, జేసీబీలల్లో ఎక్కి వరద ప్రాంతాల్లో సంచరించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారని, ప్రతి ఒక్కరు ఆయన అభినందించాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. తాను వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లడం లేదని వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై డీసీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. తాను వరద ప్రాంతాలకు వెలితే సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందని అధికారులు చెప్పారని, అందుకే తాను ఆ ప్రాంతాలకు వెళ్లలేదని డీసీఎం పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు. అందుకే తాను ప్రాంతాలకు వెళ్లలేదని పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మీరు పర్యటించి ఆ తర్వాత తనపై విమర్శలు చేయాలని డీసీఎం పవన్ కల్యాణ్ వైసీపీ నాయకుల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు.
వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించాలంటే మిమ్మల్ని తన కాన్వాయ్ లో స్వయంగా తానే పిలుచుకొని వెలుతానని, ఆ తర్వాత ఆ ప్రాంతాలు పరిశీలించింది తనకు సలహాలు ఇవ్వాలని పవన్ కల్యాణ్ వైసీపీ నాయకులు సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ జిల్లా వరదల కారణంగా ఎక్కువగా దెబ్బతిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. విపత్తు సమయంలో అందరం కలిసి ప్రజల్ని ఆదుకోవాలి. ముందు వైసీపీ సహాయంచేసి అప్పుడు మాపై విమర్శలు చేయండి. ఇళ్లలో కూర్చొని నోటికొచ్చినట్లు మాట్లాడటం సరైంది కాదని వైసీపీ నేతల తీరును పవన్ విమర్శించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…