Sajjala Ramakrishna Reddy : కాంగ్రెస్‌కి మ‌ద్దతు ఇచ్చిన ష‌ర్మిళ‌.. స‌జ్జ‌ల రియాక్ష‌న్ ఏంటంటే..!

Sajjala Ramakrishna Reddy : మ‌రి కొద్ది రోజుల‌లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ స‌మీక‌ర‌ణాలు అన్ని మారుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వైఎస్సార్ టీపీ పార్టీ దూరంగా ఉంటుందని, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. వైఎస్సార్ టీపీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. తెలంగాణ ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తెలంగాణపై కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ఉద్దేశం లేదని తెలిపారు. సంక్షేమం కోసం వైఎస్సార్ టీపీని స్థాపించామని , కేసీఆర్ తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నారని విమర్శించారు.

కేసీఆర్ పాలన అంతం చెయ్యడానికి పార్టీ ఏర్పాటు చేశామని వెల్లడించారు. పార్టీ పెట్టినప్పటి నుండి ప్రజలతో నమ్మకంగా ఉన్నామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం మహిళ అని కూడా చూడకుండా జైల్లో పెట్టిందన్నారు. ప్రతి వర్గానికి మేలు చేయడానికి వైఎస్సార్ టీపీ చూసిందన్నారు. కేసీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కూడా ప్రజల కోసమేనని తెలిపారు ష‌ర్మిల‌. ఈ వ్యతిరేక ఓటు చీల్చవద్దని కాంగ్రెస్ నేతలు తమను కోరారని తెలిపారు. ‘కాంగ్రెస్ కి అవకాశం ఉన్న సమయంలో మీరు ఎలా పోటీ చేస్తారని అడిగారు.. రాజశేఖర్ బిడ్డగా పార్టీని ఒడిస్తావా అని నన్ను అడిగారు’ అని పేర్కొన్నారు.

Sajjala Ramakrishna Reddy reaction about ys sharmila in congress
Sajjala Ramakrishna Reddy

కాంగ్రెస్ పార్టీ అంటే తనకు గౌరవం ఉందన్నారు. దేశంలో సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీసే ఉద్దేశం తనకు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు చీలిస్తే మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తే చరిత్ర తనను క్షమించదన్నారు. అవినీతి పాలన అంతం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో వైఎస్ ఆర్ టీపీ పోటీ చేయడం లేదని మరోసారి స్పష్టం చేసింది ష‌ర్మిల‌. అయితే కాంగ్రెస్‌కి వ్య‌తిరేఖంగా వైఎస్ జ‌గ‌న్ ఉండ‌గా, ఇప్పుడు ఆమె సోద‌రి ష‌ర్మిళ కాంగ్రెస్‌కి స‌పోర్ట్ చేయ‌డం ఆశ్చ‌ర్యంగా మారింది. అయితే దీనిపై స‌జ్జ‌ల స్పందిస్తూ.. జ‌గ‌న్ గారు ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌జ‌ల బాగోగులు, పాల‌సీల గురించి ఆలోచిస్తున్నారే త‌ప్ప ప‌క్క రాష్ట్రాల గురించి ఆలోచించ‌డం లేదు. ష‌ర్మిళ ఎందుకు కాంగ్రెస్‌తో క‌లిసిందో ఆమె ఇష్టం. దానికి క్లారిటీ ఆమెనే అడిగితే మంచిద‌ని స‌జ్జ‌ల స్ప‌ష్టం చేశారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

18 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

5 days ago