Chandra Babu : ఆసుప‌త్రిలో చంద్ర‌బాబు.. ఆప‌రేష‌న్ పూర్త‌య్యాక చిరున‌వ్వులు..

Chandra Babu : స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి మ‌ధ్యంతర బెయిల్ ద్వారా 52 రోజుల త‌ర్వాత జైలు నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన చంద్ర‌బాబు ఆసుపత్రులు తిరుగుతూ బిజీగా ఉన్నారు. అనారోగ్యం కార‌ణంగా ఆయ‌న‌కు బెయిల్ రాగా, ఇప్పుడు త‌న అనారోగ్యంకి సంబంధించి చికిత్స తీసుకుంటున్నాడు. క్యాటరాక్ట్ సమస్యతో బాధపడుతున్న ఆయన గతంలో ఓ కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. తాజాగా రెండో కంటికి చేయించుకున్నారు. చంద్రబాబు కంటి ఆపరేషన్ కు సంబంధించిన ఫొటో తాజాగా సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. శస్త్రచికిత్స పూర్తయ్యాక చంద్రబాబు చిరునవ్వులు చిందిస్తుండడం ఆ ఫొటోలో చూడొచ్చు. కాగా, ఆపరేషన్ పూర్తయ్యాక చంద్రబాబు తన నివాసానికి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.

చంద్ర‌బాబు 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌ను ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు కొట్టివేయగా, సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయి నవంబర్ 8న రిజర్వ్ కాబడింది. మరోవైపు బెయిల్ పిటీషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించగా ఏపీ హైకోర్టు నవంబర్ 28కు వాయిదా వేసింది. ఈలోగా ఆరోగ్య కారణాలతో ముఖ్యంగా కుడి కంటికి కేటరాక్ట్ ఆపరేషన్ పెండింగు ఉందని చెబుతూ మద్యంతర బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు కంటి ఆపరేషన్ నిమిత్తం నాలుగు వారాల బెయిల్ మంజూరు చేసింది. తిరిగి నవంబర్ 28న జైలులో లొంగిపోవల్సి ఉంది.

Chandra Babu got his eye surgery
Chandra Babu

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాక హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో రెండు సార్లు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అంతేకాకుండా చర్మ ఎలర్జీకు సంబంధించిన వైద్యం కూడా తీసుకున్నారు. నవంబర్ 2న ఏఐజీ ఆసుపత్రిలో చేరి ఒక రోజంతా అక్కడే ఉండి వివిధ పరీక్షలు చేయించుకున్నారు. ఆ తరువాత గ్యాస్ట్రో ఎంటరాలజీ, జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, పల్మనాలజీ, డెర్మటాలజీ విభాగాల వైద్యులు పరీక్షలు చేశారు. బ్లడ్ టెస్ట్, కిడ్నీ టెస్ట్, 2డీ ఈకో, అలర్జీ స్క్రీనింగ్, ఈసీజీ, లివర్, కిడ్నీ ఫంక్షనింగ్ పరీక్షలు పూర్తి చేశారు. ఎందుకంటే రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు ఆయనకు చర్మ ఎలర్జీ సంభవించింది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago