Roja : గత కొద్ది రోజులుగా ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది. ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకుంటూ వార్తలలో నిలుస్తున్నారు. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాలలో వారాహి యాత్ర కొనసాగించగా, దీనిపై వైసీపీ నాయకులు అనేక విమర్శలు గుప్పించారు. తాజాగా మంత్రి రోజా పవన్, నారా లోకేష్, చంద్రబాబులపై సెటైరికల్ కామెంట్స్ చేసింది. ఏపీ ప్రజలు హాయ్ ఏపీ.. బై బై బీపీ (బాబు, పవన్ ).. వన్స్ ఎగైన్ వైఎస్ఆర్ సీపీ అంటున్నారని మంత్రి రోజా పేర్కొన్నారు. ఇరిటేషన్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇమిటేషన్ స్టార్ చంద్రబాబు, ఇన్స్పిరేషన్ స్టార్ జగనన్న కాలు మీద ఉన్న వెంట్రుక కూడా పీకలేరు అంటూ మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్లీ జగన్ ను సీఎం చేయాలన్న కసితో ఉన్నారని, ఎంతమంది పవన్ కళ్యాణ్ లు వచ్చినా లాభం లేదని రోజా కామెంట్ చేసింది.పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే కాలేరని జోస్యం చెప్పారు. జాతరలో వేపాకు పట్టుకొని ఉగినట్లు ఊగడం తప్ప పవన్ కళ్యాణ్‌కూ ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. గోదావరి జిల్లాలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలవడం కాదు.. దమ్ముంటే రాష్ట్రం మొత్తంలో 34 మంది అభ్యర్థులను పవన్ కళ్యాణ్ సొంతంగా నిలబెట్టాలని మంత్రి రోజా సవాల్ విసిరారు.ఇక నారా లోకేష్ కూడా ఎమ్మెల్యేగా గెలవాలని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కిరణ్ కుమార్ రెడ్డిలు సొంత జిల్లా చిత్తూరుకు చేసిందేమీ లేదని మంత్రి విమర్శలు గుప్పించారు.
రికార్డులు సృష్టించాలి అన్నా.. ఆయన రికార్డులను బ్రేక్ చేయాలన్న ఆయన తప్ప వేరే ఎవరూ బ్రేక్ చెయ్య లేరని మంత్రి రోజా పేర్కొన్నారు. ఇచ్చిన మాట కోసం జగన్మోహన్ రెడ్డి చిత్తూరు డెయిరీని ప్రారంభిస్తున్నారని మంత్రి రోజా స్పష్టం చేశారు. పప్పు ఎక్కడ ఉన్నాడో కూడా ఎవరికి తెలియడం లేదని రోజా.. నారా లోకేష్ పై పంచ్‌లు విసిరింది. ఏది ఏమైన కొన్నాళ్లుగా ఒక పార్టీ నేతలు మరొక పార్టీపై దారుణమైన కామెంట్స్ చేస్తూ రాజకీయాలలో మరింత వేడి పుట్టిస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…