Roja : రోజా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సినిమాలలోను రాజకీయాలలోను రోజా తన సత్తా చూపించింది.నగిరి ఎమ్మెల్యే, మంత్రి రోజా తన సినీ, రాజకీయ జీవితంలో ఎన్నో ఓడిదుడుకులు ఎదుర్కొన్నారు. రాజకీయాల్లో అయితే ఆమెను చాలా విమర్శలు చేశారు. ఎన్నెన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. నగరి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె ప్రస్తుతం రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి హోదాలో ఉన్నారు. కాగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్ద్‌స్త్ షోలో జడ్జిగా ఉన్న ఆమె.. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాత్రం స్మాల్ స్క్రీన్‌కి పూర్తిగా దూరమయ్యారు.
తాజాగా ఓ ఛానెల్‌కు ఇంటర్వూ ఇచ్చిన రోజా సినిమాలు, రాజకీయాల పరంగా తాను ఎదుర్కొంటోన్న ఒడిదొడుకులను పంచుకున్నారు. ముఖ్యంగా తనపై, తన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా కొందరు చేస్తోన్న ట్రోల్స్ గురించి చెప్పి ఎమోషనల్ అయ్యారు. ‘నా కూతురు అన్షు మాలిక చాలా సెన్సిటివ్. తనది చాలా మృదు స్వభావం. అలాంటిది సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు తన కూతురు ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన పోస్టులు చేయగా, వాటిని చూసి నా కుమార్తె చాలా బాధపడింది. ఇలాంటివన్నీ మనకు అవసరమా అంటూ మొహం మీదే నన్ను ప్రశ్నించింది.
అలాగే నా సోదరుడి గురించి కూడా చాలా అభ్యంతరకరంగా మాట్లాడారు. అయితే సెలబ్రిటీలకు ఇలాంటివన్నీ సర్వసాధారణమని నా పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాను అంటూ భావోద్వేగానికి గురైంది రోజా. నాకు నా అన్నలే సర్వస్వమని చెప్పిన రోజా, ఓ సందర్భంలో అభిమానంతో నన్ను నా అన్న ముద్దు పెట్టుకుంటే, దానిపై తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది. ఆ సమయంలో చాలా మానసిక వేదనను అనుభవించాం అని పేర్కొంది రోజా. కాగా, రోజా కంటతడి పెట్టిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.