Jabardasth Sowmya Rao : దాదాపు దశాబ్ద కాలం నుంచి తెలుగు బుల్లితెరపై టాప్ కామెడీ షో గా దూసుకుపోతున్న కార్యక్రమం జబర్దస్త్ .ఈ షో ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలం నుంచి జబర్దస్త్ కార్యక్రమంలో ఎవరు ఊహించని విధంగా అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. జబర్దస్త్ లో అనసూయ వెళ్ళిపోయిన తర్వాత కొత్త యాంకర్ సౌమ్యరావు వచ్చింది. చిన్నితెరపై ఆమె కనిపించే తీరు, సందర్భానుసార మాటలు ఆమెను పాపులర్ చేస్తున్నాయి. దీంతో క్రమంగా బుల్లితెరపై సౌమ్య ట్రెండ్ క్రియేట్ అవుతోంది.
సోషల్ మీడియాలో కూడా సౌమ్య రావు తన ఫాలోయింగ్ పెంచుకునేలా గేర్ వేస్తూ స్పెషల్ అట్రాక్షన్ అవుతోంది సౌమ్యరావు. రెగ్యులర్ గా గ్లామర్ ఫోటో షూట్లతో యూత్ మతిపోగొడుతోంది. అయితే సౌమ్యరావు ఇప్పుడు జబర్ధస్త్ నుండి తప్పుకుందనే వార్త నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. అనసూయ ఏ కారణంతో జబర్థస్త్ ను వీడిందో.. సౌమ్య కూడా అదే కారణంతో జబర్థస్త్ నుంచి తప్పుకుంటుందట. జబర్దస్త్ లో బాడీ షేమింగ్ కామెంట్స్ హద్దులు మీరుతున్నాయని..అందుకే అనసూయ కూడా ఈ షో నుంచి తప్పుకుందనే టాక్ వచ్చింది.
![Jabardasth Sowmya Rao : కొత్త యాంకర్ సౌమ్య రావు కూడా జబర్దస్త్‌కి గుడ్ బై చెప్పినట్టేనా.. అసలు ఏం జరిగింది..? Jabardasth Sowmya Rao reportedly getting to quit from the show](http://3.0.182.119/wp-content/uploads/2022/12/jabardasth-sowmya-rao.jpg)
ఇదే క్రమంలో కొత్తగా జబర్దస్త్ లోకి యాంకర్ సౌమ్య అడుగు పెట్టగా, మూడు , నాలుగు ఎపిసోడ్స్ బాగనే ఉంది. కాని ఆ తర్వాత సౌమ్య సైతం హైపర్ ఆది లాంటివాళ్ల డబల్ మీనింగ్ డైలాగ్స్ కి బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ ఆమెని ఇబ్బంది పెడుతున్నారట. దీంతో తాను కుదుర్చుకున్న అగ్రిమెంట్‌ని సైతం క్యాన్సిల్ చేసుకొని సౌమ్యరావు జబర్ధస్త్ కి గుడ్ బై చెప్పిందని, ఇప్పుడు మరో కొత్త యాంకర్ కోసం మల్లెమాల వెతుకులాట మొదలు పెట్టిందని ప్రచారం నడుస్తుంది.మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.