Rohit Sharma : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మధ్య టీ20లకి గుడ్ బై చెప్పి ప్రస్తుతం వన్డే, టెస్ట్‌లు మాత్రమే ఆడుతున్నాడు. అయితే బంగ్లాదేశ్‌తో సిరీస్ ఆడనుంది టీమిండియా.శ్రీలంక పర్యటన తర్వాత దొరికిన ఖాళీ సమయాన్ని కుటుంబంతో గడుపుతున్నాడు. మరో రెండు వారాల్లో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ నుంచి భారత్ తీరికలేని క్రికెట్ ఆడనుంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో సిరీస్.. అనంతరం ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో భారత్ ఆడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. ఫిట్‌నెస్ విషయంలో తరచూ ట్రోల్స్‌కి గురవుతూ ఉంటాడు. అతడు లావుగా ఉన్నాడని, పొట్ట వచ్చేసిందని.. చాలా సార్లు అతడి ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యేవి.
ఆట విషయంలో రోహిత్‌ను ప్రశ్నించేవారే లేరు. ఎటొచ్చీ సమస్యల్లా ఫిట్‌నెస్ విషయంలోనే. ఈ నేపథ్యంలో అతడు ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిటనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీకి దూరంగా ఉన్న అతడు.. జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు. ఫిట్‌నెస్ సాధించడమే లక్ష్యంగా ముంబై క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎంసీఏ షేర్ చేసింది.‘ఆధునీకరించిన మా జిమ్‌ను ఉపయోగించి కసరత్తులు చేస్తున్న తొలి వ్యక్తి రోహిత్ శర్మ.’ అని తెలిపింది. అతడి మార్గదర్శకత్వంలో ఫిట్‌నెస్ సరికొత్తశకం ప్రారంభం అవుతుందని రాసుకొచ్చింది. ఈ మేరకు రోహిత్ జిమ్ చేస్తున్న కొన్ని వీడియోలను పంచుకుంది.
ప్రస్తుతం రోహిత్ శర్మ ఫొటోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ఆడనుంది భారత్. రోహిత్ శర్మ సారథ్యంలోనే టీమ్ఇండియా బరిలోకి దిగనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవాలంటే ప్రతి టెస్టులో విజయం సాధించడం ఎంతో ముఖ్యం. ఈ క్రమంలో ఈ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేయాలని రోహిత్ శర్మ భావిస్తున్నాడు. వచ్చే మూడు నెలల్లో సుమారు 10 టెస్టులు ఆడనుంది. పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్న జట్లు జూన్‌లో లార్డ్స్ వేదికగా జరిగే ఫైనల్‌లో తలపడతాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్, ఆస్ట్రేలియాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…