Simba First Look : చాలాకాలంగా రెండు తెలుగు రాష్ట్రాలు, నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే వాటన్నింటికి చెక్ పెడుతూ నందమూరి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ క్రియేటివ్ మేకర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు మనవడు మరియు నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ రోజు మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా ఆయన లుక్‌ను రివీల్ చేశారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి తన SLV సినిమాస్‌పై లెజెండ్ ప్రొడక్షన్స్‌తో కలిసి భారీ స్థాయిలో బ్యాంక్రోల్ చేయనున్నారు. బాలకృష్ణ చిన్నకూతురు తేజస్విని నందమూరి ఈ చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరించనుంది.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలియజేస్తూ పోస్ట్ పెట్టారు. ‘సింబా ఈజ్ కమింగ్’ అంటూ మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా మూవీలోని ఆయన లుక్‌ను రివీల్ చేశారు. దీంతో బాలయ్య అభిమానులు పుల్ హ్యాపీగా ఉన్నారు. మోక్షజ్ఞకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తొలి సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు నెటిజన్లు.దర్శకుడు ప్రశాంత్ వర్మ గత రెండు రోజులుగా వరుస పోస్టులతో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి హింటూ ఇస్తూనే వస్తున్నాడు. ఈ సినిమాని ఎస్ఎల్‌వీ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి మరియు బాలయ్య చిన్న కుమార్తె మతుకుమిల్లి తేజస్విని సంయుక్తంగా నిర్మించనున్నారు.
సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్, విఎఫెక్స్ ఎఫెక్ట్స్ తో మేకర్స్ ఈ చిత్రాన్ని తీయబోతున్నారు. హీరోయిన్ గా కొత్తమ్మాయిని సెట్ చేసే పనిలో ఉన్నారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ బయటికి రాకుండా టీమ్ జాగ్రత్త పడుతోంది. ఇక ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు ఫిలిం నగర్ వర్గాల్లో తిరుగుతున్నాయి. ఇందులో బాలయ్య ఒక ప్రత్యేక క్యామియో చేయబోతున్నారట. అది కూడా శ్రీకృష్ణుడి గెటప్ లో క్లైమాక్స్ మొత్తం గూస్ బంప్స్ వచ్చే రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఇండస్ట్రీ లాంచ్ కోసం బాగా మేకోవర్ చేసుకున్న మోక్షజ్ఞ నటనకు సంబంధించిన శిక్షణ పూర్తి చేసుకున్నాడు. డెబ్యూ ఆషామాషీగా ఉండకూడదని బాలయ్య ఏళ్ళ తరబడి సమయం ఖర్చు పెట్టారు. ఒకదశలో ఆదిత్య 999 ద్వారా పరిచయం చేయాలనుకున్నారు కానీ ఎందుకనో నిర్ణయం మార్చుకున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…