Rohit Sharma : వన్డే వరల్డ్ కప్ 2023లో భారత్ విజయ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో భారత్ 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో భారత్ ఫైనల్ లోకి అడుగుపెట్టింది. అయితే భారత్ గెలుపు కంటే విరాట్ 50వ సెంచరీ, షమీ బంతితో చేసిన విన్యాసం ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ కు మంచి అనుభూతి పంచింది. షమీ ఏడు వికెట్లు తీసి సెమీ ఫైనల్ నుంచి షమీ ఫైనల్ గా మార్చేసాడు. షమీ పైన ఇప్పుడు క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మ్యాచ్ పూర్తైన అనంతరం షమీని ఎత్తేశాడు రోహిత్ శర్మ. అది చూసి కియారా అద్వాని, నీతా అంబాని చప్పట్లతో ప్రశంసలు కురిపిస్తూ ఫిదా అయ్యారు. ఇక విజయం తర్వాత మాట్లాడిన రోహిత్.. మహమ్మద్ షమీ అద్బుతంగా బౌలింగ్ చేశాడని, అతడి వల్లనే ఈ విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
షమీ ఈ వరల్డ్ కప్‌లో బంతితో చేస్తున్న విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. షమీ సామర్ధ్యం పైన తొలుత అనుమానాలతో నాలుగు మ్యాచ్ లకు దూరం పెట్టారు. కానీ, అవకాశం వస్తూనే షమీ తానెంటో టీం మేనేజ్మెంట్ చేసిన పొరపాటు ఏంటో అర్దమయ్యేలా చేసాడు. తొలి మ్యాచ్ నుంచి చెలరేగిపోతున్న షమీ సెమీ ఫైనల్ లో న్యూజీలాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఎప్పుడు వికెట్ అవసరమైతే అప్పుడు షమీ ఉన్నాడనేది కెప్టెన్ రోహిత్ నమ్మకం. కెప్టెన్ నుంచి బంతి అందుకోవంతో వికెట్ తీసి షమీ తన పైన ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు సెమీస్ లో ధీటైన జవాబు ఇస్తున్న కివీస్ బ్యాటర్లను షమీ పెవిలియన్ బాట పట్టించాడు. ఏకంగా ఏడు వికెట్లు తీసి రికార్డు క్రియేట్ చేసాడు.
షమీపై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇది సెమీ ఫైనల్ కాదని షమీ-ఫైనల్ అని చమత్కరించాడు. అటూ బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో రాణించిన టీమిండియాను అభినందించాడు. బౌలింగ్ విభాగంలో షమీ ఒంటి చేత్తో కివీస్ పైన ఆధిపత్యం సాధించాడు. క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే సెమీస్ లో రెండు హేమా హేమీ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ ఎప్పటికీ నిలిచిపోయేలా చేసారు. ఇక ఇండియా నవంబర్ 19న ఫైనల్ ఆడనుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…