Rohit Sharma And Surya Kumar Yadav : గడిచిన ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు పేలవమైన ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. ఆ ఐపీఎల్ సీజన్‌లో రోహిత్‌ను కాదని జట్టు మేనేజ్‌మెంట్ హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీని అప్పగించింది. గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా తనకు కెప్టెన్సీ ఇస్తేనే ముంబైకి మారుతానని ముంబై టీమ్ మేనేజ్‌మెంట్‌కు కండిషన్ పెట్టాడని, అందువల్లే ముంబై యాజమాన్యం రోహిత్‌ను తప్పించి పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ పరిణామాల అనంతరం ఐపీఎల్ జరిగిపోవడం, అందులో ముంబై దారుణమైన ప్రదర్శన చేయడం మనం చూశాం.
కానీ ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ అనంతరం రోహిత్ టీ20లకు గుడ్‌బై చెప్పాడు. కానీ అంతర్జాతీయ టీ20లకు మాత్రమే. ఐపీఎల్‌కు కాదు. అయితే గడిచిన ఐపీఎల్ సీజన్‌లో ముంబై యాజమాన్యం తనతో ప్రవర్తించిన తీరుకు రోహిత్ శర్మ హర్ట్ అయ్యాడట. దీంతో ఆయన వచ్చే ఐపీఎల్‌లో ముంబైకి ఆడకపోవచ్చని, అతను ముంబైకి గుడ్ బై చెప్పే చాన్స్ అధికంగా ఉందని అంటున్నారు. అలాగే పాండ్యా కెప్టెన్సీపై మరో ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ కూడా అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరూ ముంబైకి గుడ్ బై చెప్తారని వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని వారు కానీ, టీమ్ కానీ ఖండించలేదు. అదే జరిగితే వారు వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ముందుగానే మెగా వేలంలో పాల్గొంటారు.
ఇక మెగా వేలానికి రోహిత్ శర్మ వస్తే మాత్రం అతనికి రూ.25 కోట్లు ఇచ్చి అయినా సరే అతన్ని కొనుగోలు చేయాలని పలు ఫ్రాంచైజీలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరు, పంజాబ్, ఢిల్లీ, లక్నో జట్లు ఈ రేసులో ఉన్నట్లు సమాచారం. ఈ జట్లు ఐపీఎల్‌లో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. నాయకత్వ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కనుక వీరు వేలంలో రోహిత్ శర్మ కోసం పోటీ పడతారని తెలుస్తోంది. అయితే సూర్య కుమార్ యాదవ్ విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక ఈ విషయంపై స్పష్టత రావాలంటే మరికొద్ది రోజుల పాటు వేచి చూడాల్సిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…