Anasuya : అందాల ముద్దుగుమ్మ అనసూయ ఈ మధ్య కాంట్రవర్సీలకి కేరాఫ్ అడ్రెస్‌గా మారుతుంది.అనసూయ మీడియా ముందుకు వచ్చిందంటే సోషల్ మీడియాకి ఫుల్ కంటెంట్. ఆమె సమాధానాలు అలానే ఉంటాయి. కౌంటర్లు అలానే ఉంటాయి. ఆమె టచ్ చేసే విషయాలు అలానే ఉంటాయి. మీడియా సైతం దాన్నే హైలైట్ చేస్తుంది. `అర్జున్ రెడ్డి` నుంచి విజయ్ దేవరకొండతో ఏదో విషయంలో వివాదం నడుస్తూనే ఉంది. ఆయనపై అనసూయ కామెంట్లు వివాదంగా మారుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ర్జున్ రెడ్డి సినిమాతో వీళ్లిద్దరి మధ్య గోడవ స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి వీళ్ల మధ్య మనస్పర్థలు పెరుగుతూనే వచ్చాయి.
కొన్ని రోజుల క్రితం విడుదలైన ఖుషీ ఫస్ట్ లుక్ పోస్టర్ పై కూడా అనసూయ విమర్శలు చేసింది. ఇక రౌడీ ఫ్యాన్స్ కూడా అనసూయపై అదే రేంజ్ లో ట్రోల్స్ చేస్తుంటారు. ఏదేమైనప్పటికీ వీళ్లద్దిర మధ్య వివాదం మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది. కాగా తాజాగా మరోసారి అనసూయ ఈ వివాదంపై మంట పెట్టినట్లు తెలుస్తుంది. అనసూయ ప్రధాన పాత్రలో `సింబా` సినిమా రూపొందుతుంది. తాజాగా బుధవారం ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో `మీకు విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడు మేడం` అంటూ అనసూయ స్కూటీ తుడుస్తుంటాడు ఓవ్యక్తి. ఆ డైలాగ్ బాగా పేలింది. ట్రైలర్ లో హైలైట్ అయ్యింది. దాంతో ఒక రిపోర్టర్ అనసూయను అడుగుతూ.. మీకు విజయ్ దేవరకొండకు మధ్య గొడవ సద్దుమణిగిందా అని అడుగుతాడు.
దీనికి అనసూయ సమాధానమిస్తూ.. నేను ఈ విషయంపై స్పందిచాలి అనుకోట్లేదు. సినిమాలో ఎలాగైతే సందేశం ఇస్తామో అలాగే నేను ఇవ్వాలి అనుకున్నాను. మా మధ్య అంతా పెద్ద గోడవ జరగలేదు. స్టేజీ మేనర్స్ గురించే ఆ రోజు మాట్లాడాను. లైమ్ లైట్‌లో ఉన్నప్పుడు పద్ధతిగా ఉండాలి. అది ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. అది లిమిట్స్ దాటినప్పుడు అందరికీ అర్థమవుతుంటాయ్. ఆరోజు ఎవరు స్పందిచకపోవడంతో నేను మాట్లాడాల్సి వచ్చింది. అంతే తప్ప నాకు ఎవరు మీద కోపం లేదు. అంటూ తెలిపింది.ఇక ఈ అమ్మడు మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. ఆమె ఇప్పుడు మూడు, నాలుగు సినిమాలలో నటిస్తుంది. అందులో పుష్ప ది రూల్ కూడా ఒకటి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…