RK Roja : ఏపీలో దారుణాతి దారుణంగా ఓడిన తర్వాత రోజా మళ్లీ కనిపించింది లేదు. ఆమె సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉంటూ వచ్చింది. తాజాగా రోజా చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయాలలో హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సంస్కరణలే ఇప్పుడు విజయవాడ ప్రజలను గట్టెక్కిస్తున్నాయంటూ రోజా ట్వీట్ చేశారు. జగనన్న తీసుకొచ్చిన రేషన్ వాహనాలు, జగనన్న తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ, జగనన్న నియమించిన వలంటీర్ వ్యవస్థ, జగనన్న కట్టించిన రిటైనింగ్ వాల్, జగనన్న హయాంలో కొన్న 108, 104వాహనాలు, జగనన్న నియమించిన సచివాలయ ఉద్యోగులు, జగనన్న తీసుకొచ్చిన క్లీన్ ఆంధ్రా వాహనాలు,వజగనన్న తీసుకొచ్చిన వైఎస్సార్ హెల్త్ సెంటర్లే ప్రస్తుతం విజయవాడ ప్రజలను గట్టెక్కిస్తున్నాయంటూ రోజా ట్వీట్ చేశారు.
విజయవాడలో వరదలు అల్లకల్లోలం సృష్టించాయి.34 మంది వరకూ చనిపోగా.. లక్షల మంది వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. పంట నష్టం, ఆస్తి నష్టం ఎంతమేర అనేది తెలియాల్సి ఉంది. అయితే బుడమేరు వాగు సాగించిన విలయం నుంచి బెజవాడ వాసులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. వరద నీరు తగ్గుముఖం పట్టడంతో నీటిలో మునిగిన తమ ఇళ్లను శుభ్రపరుచుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ఫైరింజన్ల సాయంతో వీరి ఇళ్లను క్లీన్ చేయించే పనిలో ఉంది. అలాగే వరదల కారణంగా సర్వం కోల్పోవటంతో తక్షణ సాయంగా నిత్యవసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. ఇక బాధితుల కోసం సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు భారీ విరాళాలు అందిస్తుండగా.. సామాన్యులు సైతం తమకు చేతనైనంత సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.
అయితే విజయవాడ వరదలు, ప్రభుత్వ సహాయక కార్యక్రమాలు ఇలా ఉన్న నేపథ్యంలో మాజీ మంత్రి, వైసీపీ ముఖ్య నేత రోజా కీలక ట్వీట్ చేశారు. మరోవైపు విజయవాడ వరదలకు మీరంటే మీరు కారణమంటూ అధికార టీడీపీ కూటమి, విపక్ష వైసీపీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ చేపట్టిన సంస్కరణలే బెజవాడ వాసులను ఈ విపత్తు నుంచి గట్టెక్కిస్తున్నాయని రోజా చెప్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం హయాంలో బుడమేరు వాగు ఆక్రమణకు గురైన అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదనేదీ టీడీపీ నేతల వాదన. మరోవైపు ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారనేదీ వైసీపీ ఆరోపణ. ఇదే సమయంలో వాలంటీర్లు ఉంటే ప్రజలను అప్రమత్తం చేసేవారని.. అలాంటి వాలంటీర్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…