Rinku Singh : టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఐర్లాండ్‌తో విక్టరీ కొట్టిన భారత్ రీసెంట్‌గా పాకిస్తాన్‌పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఆరు పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. డ్రాప్ ఇన్ పిచ్‌పై బ్యాటర్లు చేతులేత్తేసినా.. బౌలర్లు మాత్రం అదరగొట్టడంతో మంచి విజయం సాధించారు. ఈ విక్టరీతో తమ గ్రూపులో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది రోహిత్ సేన. ఐర్లాండ్, పాకిస్థాన్‌పై విజయం సాధించిన టీమిండియా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా.. యూఎస్‌ఏ కూడా పాకిస్థాన్, కెనడాను ఓడించి మరో సంచలన విజయాన్ని నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది.
ఈ మ్యాచ్ గెలిచిన జట్టు గ్రూప్-ఏ నుంచి అధికారికంగా సూపర్-8కు అర్హత సాధించనుంది. వర్షం కారణంగా రద్దయితే మాత్రం పాకిస్థాన్ సూపర్ 8 చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే భారత్ ఆడిన రెండు మ్యాచ్‌లు గెలిచిన కూడా ఓ ఆటగాడి పర్‌ఫార్మెన్స్ అంతగా బాగాలేకపోవడంతో ఇప్పుడు తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఆటగాడి చెత్తాటపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ కోరి కోరి ఈ ఆటగాణ్ని తెచ్చుకుంటే జట్టు కొంపముంచుతున్నాడని ఫైరవుతున్నారు. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరో కాదు శివమ్ దూబే.
వరుసగా రెండు మ్యాచుల్లో కూడా విఫలమయ్యాడు. పాకిస్థాన్‌పై కేవలం 9 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేసి నసీమ్ షా బౌలింగ్‌లో ఔటయ్యాడు. కీలక సమయంలో టీమిండియాను ఆదుకోవాల్సింది పోయి.. చేతులేత్తేశాడు. ఫీల్డింగ్‌లో కూడా నిరాశపర్చాడు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో మహ్మద్ రిజ్వాన్ ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ను చేజార్చాడు. దీంతో.. ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అనవసరంగా శివమ్ దూబేను జట్టులోకి తీసుకుంటున్నారని.. వెంటనే అతన్ని పక్కన పెట్టి శాంసన్‌ని తీసుకోవాలని లేదంటే రింకూ సింగ్‌ని తీసుకోవాలంటూ అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్ ఫస్ట్ ఆఫ్‌లో విశ్వరూపం చూపించడంతో శివమ్ దూబేని వరల్డ్ కప్ కోసం ఎంపిక చేశాడు. సెకండాఫ్‌లో పూర్తిగా నిరాశపరిచాడు. 14 మ్యాచుల్లో 396 పరుగులు చేశాడు. అయితే ఇలాంటి నాసిరకం ఆటగాడు కోసం డైమండ్ లాంటి రింకూ సింగ్‌ని పక్కనపెట్టారని ఫైరవుతున్నారు.