Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి పీఠం ఎవరు దక్కించుకుంటారనే చర్చ కొద్ది రోజులుగా సాగింది. ఎట్టకేలకి దానిపై ఓ క్లారిటీ వచ్చింది. 119 నియోజకవర్గాల్లో 64 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేతగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేరుని ప్రకటించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతగా ఎన్నుకోవడంతో రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్లుండు అంటే డిసెంబర్ 7వ తేదీన రేవంత్ రెడ్డి తెలంగాణ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయనున్నారు.
సీఎం అయిన తర్వత తాను తొలి సంతకం దేనిపై చేస్తారు అనే దానిపై క్లారిటీ వచ్చింది. సోనియాగాంధీ తెలంగాణకు వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే ఆరు గ్యారెంటీలపైనే ఆయన తొలి సంతకం పెడతానని గతంలో చెప్పారు. కాంగ్రెస్ గ్యారంటీలను ప్రకటించిన తర్వాత రోజు నుంచి కేసీఆర్ కనిపించడం లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆరు గ్యారెంటీలను చూసిన కేసీఆర్ కు చలి జ్వరం పట్టుకుందని చెప్పారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే.. ఆ పనిచేస్తారని అందరు ముచ్చటించుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు అందిపుచ్చుకుంటారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయనకి సంబంధించి పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు రేవంత్ రెడ్డి . తెలంగాణ వచ్చాకా కొంత కాలం టీటీడీపీ చీఫ్ గా పని చేసిన రేవంత్ రెడ్డి.. 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. అయితే చంద్రబాబు హయాంలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి పని చేయగా, తాను పేరుకి వర్కింగ్ ప్రెసిడెంట్ కాని ఏం చెబితే అది సాగిపోయేది అని అన్నారు. లోకేష్‌కి జరిగిందో లేదో కాని, నాకు అయితే జరిగింది. అన్ని విషయాలలో నేను ఏదైన చెబితే కొంత గ్యాప్ తీసుకున్నా కూడా అది మాత్రం చేసి తీరతాడు. నాకు చంద్రబాబు విషయంలో ఎలాంటి ఇబ్బంది రాలేదు. ప్రొఫెషనల్‌గా కాకుండా పర్సనల్ మాకు మాకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని రేవంత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…