Janasena Premkumar : ఈ సారి తెలంగాణ ఎన్నికలు వాడివేడిగా సాగాయి. టీడీపీ పోటీ నుండి తప్పుకోవడంతో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగింది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి గత రెండు దఫాలు అధికారాన్ని కట్టబెట్టారు ప్రజలు. ఈసారి ప్రజలు మార్పును కోరుకున్నారు. ఆ మార్పు ఫలితమే కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం. అంతేకాదు సిట్టింగ్ ఎమ్మెల్యేల పై తీవ్ర వ్యతిరేకత, తాము ఎవరిని నిలబెట్టిన జనం గెలిపిస్తారన్న అతి విశ్వాసం, ప్రజా సమస్యల కోసం పోరాటం చేసే పార్టీలపై నిరంకుశ వైఖరి వెరసి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలైంది.
తెలంగాణ ప్రజలలో కెసిఆర్ పట్ల విశ్వాసం తగ్గిపోవడం, కొద్దిరోజులు మోడీని పొగిడి, కొద్దిరోజులు మళ్లీ తిట్టడం వంటి కారణాలు, మీడియాలో పదేళ్లుగా వ్యతిరేక వార్తలు రాకుండా మీడియాపై నిరంకుశ ధోరణి అవలంబించడం, సొంత మీడియాలో ఆల్ ఈజ్ వెల్ అంటూ ప్రచారం చేసుకోవడం ప్రజలకు నచ్చలేదు. దీంతో బీఆర్ఎస్‌ని ఇంటికి పంపించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల కోసం కూకట్‌పల్లి నియోజకవర్గంలో బీజేపీ, జనసేన పార్టీలకు కూడా బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నాయకులు ప్రేమ్ కుమార్ కూడా ఓడిపోయారు.
ప్రేమ్ కుమార్ ఓటమి పట్ల చాలా మంది కార్యకర్తలు, అభిమానులు తీవ్ర నిరాశకి గురయ్యారు. అయితే ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ…. తాను ప్రజల కోసం ఎంతో శ్రమిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కూకట్‌పల్లిలో ట్రాఫిక్ సమస్య చాలా ఉందని, ఇది ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు అని, దానిని తీర్చే బాధ్యత తాను తీసుకుంటానని ప్రేమ్ కుమార్ అన్నారు. అంతేకాకుండా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ..కూకట్ పల్లి ప్రజలు డబ్బులు తీసుకొని ఓటు వేసే వారు కాదని, చాల నిజాయితీగా ఉంటారని ప్రేమ్ కుమార్ అన్నాడు. గెలుపుపై చాలా ధీమాగా ఉన్న ప్రేమ్ కుమార్ ఇలా ఓడిపోవడం ఆయనని చాలా బాధించింది. వచ్చే ఎన్నికలలో ప్రేమ్ కుమార్ ని తప్పక గెలిపించుకుంటామంటూ కొందరు చెప్పుకొస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…