Renu Desai : రేణూ దేశాయ్.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. హీరోయిన్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా, రచయితగా, దర్శకురాలిగా మల్టీటాలెంటెడ్ అనిపించుకుంది రేణూ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు.. ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లో ఉంటుంది. పవన్ కళ్యాణ్ నుండి విడిపోయిన తర్వాత పిల్లల గురించే ఆలోచిస్తూ వారి బాగోగులు చూసుకుంటూ ఉంటున్న రేణూ దేశాయ్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో స్టన్నింగ్ పోస్ట్‌లు పెడుతుంటుంది. ఇవి చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయి.
ప్రేమ వివాహం చేసుకున్న పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ 2016లో విడాకులు తీసుకొని విడిపోయారు. వీరి ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్య అమ్మ రేణూ దేశాయ్ దగ్గరే పెరుగుతున్నారు. విడాకుల అనంతరం రేణూ పూణే వెళ్లిపోయారు. అక్కడే ఆమె కెరీర్ స్టార్ట్ చేశారు. మరోవైపు పవన్ అన్నా లేజినోవాను వివాహం చేసుకున్నారు. అయితే గత ఏడాది రెండో పెళ్ళికి రెడీ అవుతున్నట్టు రేణూ దేశాయ్ హింట్ ఇచ్చారు. ఓ వ్యక్తితో ఎంగేజ్మెంట్ జరిగిన ఫోటోను కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఆ తర్వాత దీనికి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ లేదు.
తాజాగా రేణూ దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. జీవితంలో మనకు అవసరం ఉన్నప్పుడు మన చేయి పట్టుకుని నడిపించే ఒక తోడు అవసరం అని పేర్కొంటూ రేణూ ఓ రీల్ ని ఇన్‌స్టా లో షేర్ చేసింది. అనంతరం మరో వీడియోలో మీ సోల్ మేట్ ని వెతకడానికి ముందు మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోండి.. అని ఆమె తన పోస్టులో పేర్కొంది. ఈ పోస్ట్ లకు ఆమె వ్యక్తిగత జీవితంతో లింక్ చేస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఒక తోడు అవసరం అని పేర్కొనడంతో.. ఆమె రెండో పెళ్లి చేసుకోవాలని ఆశ పడుతుందేమో అని వ్యాఖ్యానిస్తున్నారు. మరి దీనిపై రేణూ దేశాయ్ ఏమైన స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…