Renu Desai : పవన్, రేణూదేశాయ్‌ల ముద్దుల తనయుడు అకీరా నందన్ గత కొద్ది రోజులుగా వార్తలలో నిలుస్తున్నాడు. ఏపీ ఎన్నికల రిజల్ట్స్ వచ్చినప్పటి నుండి కూడా అకీరా వార్తలలో నిలుస్తున్నాడు. పవన్ తో ఉంటూ చంద్రబాబు నాయుడు, ప్రధాని మోదీని కలవడం జరిగింది. అయితే అకీరా గురించి రేణూ దేశాయ్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది.పవన్ కళ్యాణ్‌తో కలిసి అకిరా నందన్ ప్రధాని మోదీని కలిసిన సంగతి తెలిసిందే. తాను ఆరాధించే బీజేపీ, నాయకుడు ప్రధాని మోదీని తన కొడుకు అకిరా కలవడంతో రేణూ దేశాయ్ ఉప్పొంగిపోయారు. భవిష్యత్తులో అకిరా తన స్వశక్తితో ఎదిగి మళ్లీ ప్రధానిని కలవాలి అంటూ తల్లిగా రేణూ దేశాయ్ ఎమోషనల్ అయ్యారు.
మొదటి నుంచి బీజేపీ వ్యక్తిగా ఉన్న తనకు ఇలా తన కుమారుడు ప్రధానిని కలవడం చాలా సంతోషంగా ఉందంటూ వరుస పోస్టులు చేశారు. అయితే ఆమె చేసిన ప్రతి పోస్టును నిశితంగా గమనించిన నెటిజన్స్.. అందులో అన్నా లెజినోవా ఉన్న వరకు కట్ చేసి పవన్, అకీరా, మోదీ ఉన్న ఫోటోస్ మాత్రమే ఎడిట్ చేశారంటూ.. పలు రకాలుగా కామెంట్స్ చేశారు. కామెంట్ సెక్షన్ డిసబుల్ చేసినా పర్సనల్ మెసేజ్ లు చేశారు. దీంతో తనకు వస్తున్న కామెంట్స్ పై రేణూ దేశాయ్ స్పందించారు. నా బాధ వాళ్లకు నవ్వులాటగా మారింది.. తన ఫీలింగ్స్ కు ఎలాంటి విలువ లేదని.. ఎందుకంటే తాను రోబో అంటూ అంటూ తన ఇన్ స్టా స్టోరీలో కామెంట్స్ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ రిప్లై ఇచ్చారు.
తనకు జరిగినట్లు.. వాళ్లకు కూడా జరిగితే ఆ బాధ అర్థం అవుతుందంటూ కామెంట్ చేశారు. ఇలా నెగిటివిటీని ప్రచారం చేస్తారనే కామెంట్ సెక్షన్ క్లోజ్ చేసినా.. నా మీద మీమ్స్ చేసి కామెడీ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘నాన్న పాలిటిక్స్ చూసుకుంటాడు.. నువ్వు హీరో అయిపో’ అంటున్నారు నెటిజన్స్. అభిమానుల కామెంట్స్‌పై రేణు దేశాయ్ స్పందించారు. అకిరాను జూనియర్ పవన్ కల్యాణ్ అని అనడం, జూనియర్ పీకే అనడం, పీకే 2 అనడం ఇష్టం లేదని చెప్పారు. జూనియర్ పవన్ కల్యాణ్ అని అనిపించుకోవడం అకిరాకు, తన తండ్రికి ఇష్టం లేదు. కాబట్టి తన ఫీలింగ్‌ని అర్థం చేసుకోని అకిరా నందన్ అని పిలవండి అని పోస్ట్ చేశారు రేణు దేశాయ్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…