Rayalaseema Ramanna Chowdary : రాయ‌ల‌సీమ రామ‌న్న చౌద‌రి చిత్రానికి ర‌జ‌నీకాంత్ క‌థ అందించారా.. అయినా ఎందుకు ఫ్లాప్ అయింది..?

Rayalaseema Ramanna Chowdary : క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన చిత్రం రాయ‌ల‌సీమ రామ‌న్న చౌదరి. ఈ చిత్రం 15 సెప్టెంబరు 2000లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో మోహన్ బాబు తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయగా జయసుధ, ప్రియాగిల్ వీరికి జంటగా నటించారు. మోహ‌న్‌బాబు 500వ చిత్రంగా భారీ అంచ‌నాల‌తో విడుద‌ల అయిన ఈ సినిమా ప‌రాజ‌యం పాలు అయింది. 500వ సినిమాల‌కి ద‌గ్గ‌ర అవుతున్న నేప‌థ్యంలో ఈ చిత్రంతో మంచి విజ‌యం సాధించాల‌ని మోహ‌న్ బాబు ఎంతో కృషి చేశాడు. ప‌రిచూరి బ్ర‌ద‌ర్స్‌కు క‌థ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ద‌ర్శ‌కునిగా బి.గోపాల్ చేయ‌మ‌ని అడ‌గ‌గా.. మ‌హేష్ బాబు సినిమాతో చేస్తాన‌ని బి.గోపాల్ మాట ఇచ్చారు.

ఇక ర‌జినీకాంత్ అయితే దేవుడి మీద సినిమా చేయాల‌ని స్వ‌యంగా తానే రెండు క‌థ‌లు రాశాడు. బాబా త‌న వ‌ద్ద‌నే ఉంచుకొని ఎప్ప‌టి నుంచో స‌త‌మ‌త‌మ‌వుతున్న త‌న ఆప్త‌మిత్రుడు మోహ‌న్‌బాబును ర‌మ్మ‌ని ర‌జినీ ఫోన్ చేశారు. ర‌జినీకాంత్ క‌థ మొత్తం చెప్పి ఇది నీకు సూట‌వుతుందని చెప్పాడు. మీ స్టైల్‌లో మార్చి సినిమాను చేద్దామా అని ప‌రుచూరి బ్ర‌ద‌ర్‌ను అడిగారు మోహ‌న్‌బాబు. అయితే ర‌జనీకాంత్ రాసిన క‌థ‌తో స్క్రిప్ట్ చేయాలి అనే స‌రికి వారికి కొత్త‌గా అనిపించింది. ఆ త‌ర్వాత మాత్రం క‌థ‌లో గొప్ప‌త‌నం అర్థ‌మై ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌.

Rayalaseema Ramanna Chowdary why this movie flop what are the reasons
Rayalaseema Ramanna Chowdary

ప‌రుచూరి బ్ర‌ద‌ర్‌కు ఈ స్టోరీ భ‌లే న‌చ్చేసింది. రామ‌న్న క్యారెక్ట‌ర్ జోడీగా జ‌య‌సుధను తీసుకున్నారు. ఇక సెకండ్ మోహ‌న్‌బాబు క్యారెక్ట‌ర్‌ను ముందుగా ఎవ‌రైనా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ లేదా ఎవ‌రైనా హీరోతో కానీ చేద్దాం అనుకున్నారు. ఫైన‌ల్ గా ఆ క్యారెక్ట‌ర్ కూడా మోహ‌న్ బాబే పోషించారు. ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు. అప్ప‌ట్లో ర‌జినీకాంత్ చీఫ్ గెస్ట్ గా వ‌చ్చి యూనిట్ స‌భ్యుల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. తిరుప‌తి, రాజ‌మండ్రి, రామానాయుడు స్టూడియో ల‌లో చిత్ర షూటింగ్ పూర్తి కాగా, అప్ప‌ట్లోనే ఈ సినిమా కోసం 30 కెమెరాల‌ను వాడారు. పాట‌ల కోసం థాయ్‌లాండ్‌, మ‌లేషియా వెళ్లారు. 3 కోట్ల బ‌డ్జెట్‌తో నాలుగు నెల‌ల వ్య‌వ‌ధిలోనే సినిమా పూర్తైంది. ఈ మూవీ షూటింగ్ స‌మ‌యంలో గుర్ర‌పు బండిమీద ప‌డి మోహ‌న్‌బాబు గాయ‌ప‌డ‌డంతో ఆగ‌స్టులో విడుద‌ల చేద్దామ‌నుకున్న మూవీ సెప్టెంబ‌ర్‌కు వాయిదా ప‌డింది.అయితే ఈ సినిమా రిలీజ్ కోసం భారీ హంగామా చేసిన చివ‌రికి చ‌తికిల ప‌డింది.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago