Rayalaseema Ramanna Chowdary : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం రాయలసీమ రామన్న చౌదరి. ఈ చిత్రం 15 సెప్టెంబరు 2000లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో మోహన్ బాబు తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయగా జయసుధ, ప్రియాగిల్ వీరికి జంటగా నటించారు. మోహన్‌బాబు 500వ చిత్రంగా భారీ అంచనాలతో విడుదల అయిన ఈ సినిమా పరాజయం పాలు అయింది. 500వ సినిమాలకి దగ్గర అవుతున్న నేపథ్యంలో ఈ చిత్రంతో మంచి విజయం సాధించాలని మోహన్ బాబు ఎంతో కృషి చేశాడు. పరిచూరి బ్రదర్స్‌కు కథ బాధ్యతలు అప్పగించారు. దర్శకునిగా బి.గోపాల్ చేయమని అడగగా.. మహేష్ బాబు సినిమాతో చేస్తానని బి.గోపాల్ మాట ఇచ్చారు.
ఇక రజినీకాంత్ అయితే దేవుడి మీద సినిమా చేయాలని స్వయంగా తానే రెండు కథలు రాశాడు. బాబా తన వద్దనే ఉంచుకొని ఎప్పటి నుంచో సతమతమవుతున్న తన ఆప్తమిత్రుడు మోహన్‌బాబును రమ్మని రజినీ ఫోన్ చేశారు. రజినీకాంత్ కథ మొత్తం చెప్పి ఇది నీకు సూటవుతుందని చెప్పాడు. మీ స్టైల్‌లో మార్చి సినిమాను చేద్దామా అని పరుచూరి బ్రదర్‌ను అడిగారు మోహన్‌బాబు. అయితే రజనీకాంత్ రాసిన కథతో స్క్రిప్ట్ చేయాలి అనే సరికి వారికి కొత్తగా అనిపించింది. ఆ తర్వాత మాత్రం కథలో గొప్పతనం అర్థమై ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడు పరుచూరి బ్రదర్స్.
పరుచూరి బ్రదర్‌కు ఈ స్టోరీ భలే నచ్చేసింది. రామన్న క్యారెక్టర్ జోడీగా జయసుధను తీసుకున్నారు. ఇక సెకండ్ మోహన్‌బాబు క్యారెక్టర్‌ను ముందుగా ఎవరైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేదా ఎవరైనా హీరోతో కానీ చేద్దాం అనుకున్నారు. ఫైనల్ గా ఆ క్యారెక్టర్ కూడా మోహన్ బాబే పోషించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. అప్పట్లో రజినీకాంత్ చీఫ్ గెస్ట్ గా వచ్చి యూనిట్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. తిరుపతి, రాజమండ్రి, రామానాయుడు స్టూడియో లలో చిత్ర షూటింగ్ పూర్తి కాగా, అప్పట్లోనే ఈ సినిమా కోసం 30 కెమెరాలను వాడారు. పాటల కోసం థాయ్‌లాండ్, మలేషియా వెళ్లారు. 3 కోట్ల బడ్జెట్‌తో నాలుగు నెలల వ్యవధిలోనే సినిమా పూర్తైంది. ఈ మూవీ షూటింగ్ సమయంలో గుర్రపు బండిమీద పడి మోహన్‌బాబు గాయపడడంతో ఆగస్టులో విడుదల చేద్దామనుకున్న మూవీ సెప్టెంబర్‌కు వాయిదా పడింది.అయితే ఈ సినిమా రిలీజ్ కోసం భారీ హంగామా చేసిన చివరికి చతికిల పడింది.