Rashmika Mandanna : ఛలో సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. కొంతకాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈమె పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పలు బడా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ఈ భామ మరోవైపు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నేషనల్ క్రష్ అనే హోదా.. సినిమాకు నాలుగైదు కోట్ల సంపాదన.. చేతినిండా సినిమాలు.. ఖరీదైన కార్లు, బంగ్లాలు.. రష్మిక మందాన లేటెస్ట్ ప్రొఫైల్ ఇది. అలాంటి రష్మిక మందన్న కనీసం ఇంటి రెంట్ కట్టలేదంటే నమ్ముతారా..?
ఒక చిన్న బొమ్మ కొనుక్కోవడానికి డబ్బులు లేవంటే వింటారా? కానీ ఇవ్వన్నీ నిజమే అంటుంది రష్మిక మందన్న. తన చిన్నతనంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు గురించి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. రష్మిక చిన్నతనంలో పేరెంట్స్ కనీసం ఇంటి అద్దె కట్టలేకపోయేవారట. ప్రతి రెండు నెలలకు ఇల్లు మారేవారట. ఇంటి అద్దె చెల్లించలేదని యజమానులు ఇల్లు ఖాళీ చేయించి బయటకు పంపేవారట. దీంతో అద్దె ఇల్లు వెతుక్కోవడం నిత్యకృత్యం అయ్యేదట. పేరెంట్స్ కి తాను కోరుకుంది ఇవ్వాలని ఉండేదట. అయితే అది కొనివ్వడానికి డబ్బులు ఉండేవి కావట.
కనీసం ఒక బొమ్మ కొనిపెట్టే స్థోమత కూడా రష్మిక పేరెంట్స్ కి ఉండేది కాదట. అందుకే ప్రతి రూపాయిని నేను గౌరవిస్తాను. ఈ సక్సెస్, ఫేమ్ గ్రాంటెడ్ తీసుకోను. మా కుటుంబం అనుభవించిన ఆర్థిక ఇబ్బందులు నాకు ఇంకా గుర్తు ఉన్నాయి. చిన్నప్పుడు కేవలం నీడ కోసం మేము పడ్డ ఇబ్బందులు నాకు తెలుసని, రష్మిక అలనాటి చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది. ఆమె ప్రస్తుత ఆస్తి విలువ కోట్లలో ఉంది. అంతటి పేదరికం నుండి రష్మిక ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది. ఇటీవల సోషల్ మీడియా ట్రోల్స్ పై రష్మిక మండిపడ్డ విషయం తెలిసిందే. ఇకపై వాటిని సహించేది లేదంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…