Rashmika Mandanna : ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న రష్మిక ఇప్పుడు కుర్రాళ్ల కలల రాణిగా మారింది. తన క్యూట్ లుక్స్‌తో పాటు ట్రెండీ స్టైల్స్‌తో మెస్మరైజ్ చేస్తుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్న ఈ నేషనల్ క్రష్ గుడ్ బై అనే సినిమాతో పలకరించబోతుంది. ఈ సినిమాలో రష్మిక.. అమితాబ్ తో కలిసి నటించగా ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలలో తెగ యాక్టివ్‌గా పాల్గొంటుంది. వికాస్ బాహ్ల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
సినిమా ప్రమోషన్స్ ఏమో కానీ రష్మిక ట్రెండీ దుస్తులలో కనిపిస్తూ కుర్రాళ్ల గుండెలలో గుబులు పుట్టిస్తుంది. గ్లామరస్ అవుట్ ఫిట్స్ లో తన స్పైసీ అప్పియరన్స్ తో మెంటల్ తెప్పిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ థైస్ కనిపించేలా లైట్ పింక్ చెక్స్ గౌను ధరించి కుర్రాళ్లకు కంటిపై కునుకు లేకుండా చేసింది. కొందరు రష్మిక అందాలను చూసి ఫిదా అయిపోతుండగా, మరి కొందరు మాత్రం ప్యాంట్ మరచిపోయి వచ్చా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మిక పిక్స్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.
పుష్ప సినిమాతో హిట్‌తో ఎక్కడ చూసినా ఈమె హడావుడియే కనిపిస్తుంది. ఇటు తెలుగు.. అటు తమిళ్, హిందీ సినిమాలతో బిజీగా మారింది. ఎక్కడ చూసినా.. రష్మికనే కనిపిస్తుంది. దీనికి తోడు ఈ భామ సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తూనే ఉంటుంది. నాలుగైదు హిట్ సినిమాలతో సౌత్‌లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన రష్మిక.. దేశంలో ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరిగా నిలిచింది. సౌత్ లో సత్తా చాటుతున్న ఈ బ్యూటీ అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో నటిస్తోంది. ఇప్పుడు రష్మిక బాలీవుడ్లోనే ఫుల్ బిజీగా మారింది.