Sr NTR Food Habits : సినిమా రంగంలో హీరోగా, ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా సీనియర్ ఎన్టీఆర్ ప్రతిభను చాటుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి క్రమశిక్షణ నేర్పిన నటుడిగా ఎన్టీఆర్ కు పేరుంది. రాముడు, కృష్ణుడు పాత్రలతో పాటు రావణుడి పాత్రలో కూడా సీనియర్ ఎన్టీఆర్ నటించారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో సమయాన్ని పట్టించుకోకుండా ఎన్టీఆర్ ఎక్కువ సినిమాల్లో నటించారు. ఆయన 3 షిఫ్టుల్లో పని చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ, ఆ తరవాత మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ షూటింగ్ లో పాల్గొనే వారట.
ఆ తరవాత షిఫ్ట్ సమయాన్ని కూడా తగ్గించుకుని కేవలం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకూ షూటింగ్ లో పాల్గొనేవారట. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు కూడా అందర్నీ ఆశ్చర్యపరిచేవి. ప్రతి రోజూ ఉదయం 3 గంటలకే నిద్రలేచేవారట. ఆ తరవాత వ్యాయామం చేసి స్నానం చేసిన తరవాత 24 ఇడ్లీలను తినేవారట. ఆ ఇడ్లీలు కూడా ఇప్పుడు ఉన్నవాటిలా చిన్నగా కాకుండా ఒక్కోటి అరచేతి మందంలో ఉండేవట. ఇక కొంతకాలం ఇడ్లీలు మానేసి ఉదయాన్నే భోజనం చేయడం మొదలు పెట్టారు.
భోజనంలో ఖచ్చితంగా మాంసాహారం ఉండేలా చూసుకునేవారట. షాట్ గ్యాప్ లో ఆపిల్ జ్యూస్ తాగడానికి సీనియర్ ఎన్టీఆర్ ఇష్టపడేవారు. సమ్మర్ లో మాత్రం లంచ్ సమయంలో మామిడికాయల జ్యూస్ తాగేవారు. మామిడి పళ్ల రసంలో గ్లూకోజ్ పౌడర్ కలుపుకుని సీనియర్ ఎన్టీఆర్ తాగేవారు. వైద్యుల సలహా మేరకు కొంతకాలం పాటు అల్లం వెల్లుల్లి ముద్దను ఎన్టీఆర్ తీసుకునేవారు. అంతే కాకుండా ప్రతిరోజూ రెండు లీటర్ల బాదం పాలను సైతం తాగేవారట. అలాగే చెన్నైలో ఎప్పుడైనా బజ్జీలు తినాలనిపిస్తే 30 నుండి 40 బజ్జీలను సులభంగా తినేసేవారట.