Rakul Preet Singh : ఎక్కువగా సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ ఫుల్ ఫేమస్ అయ్యాడు ఆస్ట్రాలజర్ వేణుస్వామి. ఈయన ఒకప్పుడు.. అంటే నాగచైతన్య, సమంత పెళ్లి చేసుకునే సమయంలో వీరిద్దరూ కలిసి ఉండరని జోతిష్యం చెప్పాడు. అప్పుడు అక్కినేని అభిమానులు, జాతకాలను పెద్దగా పట్టించుకోని వారు ఈయనని సోషల్ మీడియా వేదికగా ఉతికి ఆరేశారు. అయితే నాలుగేళ్ల తర్వాత వేణుస్వామి చెప్పిందే నిజం కావడంతో ఆయన జాతకాలపై ఆసక్తి పెరిగింది. ఇటీవల ఆయన రష్మిక రాజకీయాలలోకి వెళ్లనుందని, ఆమె తన దగ్గర పూజలు కూడా చేయించుకుంటుందని కొన్ని వ్యాఖ్యలు చేశాడు.
ఇక ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రకుల్ పెళ్లి విషయంపై కూడా పెద్ద బాంబ్ పేల్చాడు. ఆమె పెళ్లి జరగదని, జరిగినా ఎక్కువ కాలం కొనసాగదని ఆయన తెలిపారు. రకుల్ తన 31వ పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీని పెళ్లి చేసుకోబోతున్నానని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఈ ఏడాదిలోనే వీరిద్దరూ ఓ ఇంటివారవుతారని సన్నిహిత వర్గాల సమాచారం. కానీ వీరి జాతకాన్ని చూసిన వేణుస్వామి పెళ్లి జరగదని, అయినా కూడా వారు విడిపోతారని సంచలన కామెంట్స్ చేశాడు.
![Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్‌కి పెళ్లి జరగదట.. జైలుకి వెళ్లడం ఖాయమట.. వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు.. Rakul Preet Singh will not get married Venu Swamy comments](http://3.0.182.119/wp-content/uploads/2022/09/rakul-preet-singh.jpg)
జాకీ భగ్నానీది మకరరాశి. ఆ రాశిలో శని దృష్టి చంద్రుడు, శుక్రుడుపై ఉండటంతో పెళ్లి జీవితంలో సమస్యలు ఉంటాయని తెలిపాడు. ఇక రకుల్ ప్రీత్ సింగ్‌ది మిథునరాశి అని, గురువు, కేతువు కలిసి ఉండటం వల్ల కుటుంబ సౌఖ్యం ఉండదని చెప్పేశాడు. ఓ కేసు విషయంలో రకుల్ జైలుకు వెళ్లే అవకాశాలున్నాయని వేణుస్వామి తెలిపారు. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. కొంత కాలంగా బాలీవుడ్‌కే పరిమితమైన రకుల్ ఓవైపు సినిమాలు, మరో వైపు ఫిట్‌నెస్ రంగంలో రాణిస్తూ బిజీగా ఉంది.