సెలబ్రిటీల ప్రేమాయణాలు, పెళ్లిళ్లు ఎప్పుడు ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి. వారికి సంబంధించిన ఏ విషయం బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు ఆసక్తిగా గమనిస్తుంటారు. గత కొద్ది రోజులుగా విజయ్ దేవరకొండ, రష్మికలకు సంబంధించి అనేక ప్రచారాలు నడుస్తున్నాయి. వారిద్దరు ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పుకొస్తున్నారు. ఇటీవల ఇద్దరు కలిసి మాల్దీవులకి కూడా వెళ్లారని ప్రచారం జరిగింది. నేషనల్ క్రష్ ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండతో ఉన్న రిలేషన్‌షిప్ గురించి మరోసారి క్లారిటీ ఇచ్చింది.
ఇటీవల న్యూ ఇయర్ సమయంలో విజయ్ దేవరకొండ, రష్మిక.. విషెస్ చెబుతూ వారి ఫోటోలను షేర్ చేయగా, ఆ ఫోటోలు మాల్దీవ్స్ లో దిగినవి కావడంతో వీరిద్దరి కలిసి అక్కడికి వెళ్లారు. అంతేకాదు వీరిద్దరూ రహస్య ప్రేమాయణం నడుపుతున్నారు అని పలు కథనాలు వచ్చాయి.దీనిపై స్పందించిన రష్మిక.. ‘నాకున్న బెస్ట్ ఫ్రెండ్స్ లో విజయ్ ఒకడు. ఆ నిజాన్ని నేను నిర్భయంగా చెబుతాను. ఆన్ స్క్రీన్ పై మా కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అవ్వడంతో, బయట మేము ఇద్దరు స్నేహితులుగా తిరుగుతున్నా ఆడియన్స్ మమ్మల్ని ప్రేమికుల గానే చూస్తున్నారు.
ఫ్రెండ్స్ కూడా కలిసి వెకేషన్ ట్రిప్ కి వెళ్తారు. అలా వెకేషన్ ట్రిప్ కి మాతో పాటు 10 మంది మిత్రులు కూడా వచ్చారు. కానీ వారిలో మా ఇద్దర్నే నోటీసు చేస్తున్నారు. ఎందుకంటే మేము పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి. అయినా మా రిలేషన్‌షిప్ గురించి అబద్దం చెప్పాల్సిన అవసరం మాకు లేదు అంటూ రష్మిక బదులిచ్చింది. ఈ వ్యాఖ్యలతో వారిద్దరి మధ్య ఉన్నది స్నేహం మాత్రమే అని అర్ధమవుతుంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ ‘గీతాగోవిందం’తో టాలీవుడ్ లో మంచి హిట్ ను అందుకున్నారు. మరోవైపు వీరిద్దరి కెమిస్ట్రీ కూడా వెండితెరపై బాగా వర్కౌట్ అయ్యింది. దీంతో వెంటనే ‘డియర్ కామ్రేడ్’తో అలరించారు. ఈ సినిమా పెద్ద ఆకట్టుకోలేకపోయింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…