సనాతన ధర్మంలో మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని అందరు భావిస్తుంటారు. ఇదే విషయం నిజమేమో అనిపించేలా కొంతమందిని చూస్తుంటే అర్ధమవుతుంది. సినీ నటీనటులు, క్రికెటర్స్ పోలికలు ఉన్న మనుషులకు చెందిన ఫోటోలు తరచుగా చూస్తూనే ఉంటున్నాం.. ఇప్పుడు దివంగత నటి సౌందర్య మళ్ళీ పుట్టిందా అనిపించేలా ఓ అమ్మాయికి చెందిన ఫోటోలు, వీడియో లు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. దక్షిణాదికి చెందిన గొప్ప నటీమణుల్లో సౌందర్యది చెరగని స్థానం.
సౌందర్య మన మధ్య లేకపోయినా, ఆమె నటించిన చిత్రాలు అభిమానులను నేటికీ అలరిస్తుంటాయి. మలేసియాకు చెందిన ఓ అమ్మాయి సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సౌందర్యలా ఉండడమే అందుకు కారణం. నిజంగానే ఆమెను చూస్తే “అరె అచ్చం సౌందర్యలా ఉందే! అని తప్పక అంటారు. ఆమె పేరు చిత్ర. ఓ ఎంటర్ ప్రెన్యూర్. మలేసియాలో జన్మించిన భారత సంతతి అమ్మాయి చిత్ర టిక్ టాక్ లో స్టార్ డమ్ సంపాదించుకుంది.. సౌందర్యలా కనిపించే ఈ అమ్మడు… సౌందర్య నటించిన సినిమాల్లోని పాటలు, డైలాగులు, సీన్లతో టిక్ టాక్ వీడియోలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఇన్ స్టాగ్రామ్ లో చిత్రను కొన్ని వేలమందికి పైగా అనుసరిస్తుండడం విశేషం. సౌందర్యలా కనిపించడమే కాదు, తన వీడియోల్లో సౌందర్యలా హావభావాలు ప్రదర్శించడం ఆమె ప్రత్యేకతగా చెప్పవచ్చు. దాంతో నెటిజన్లు ఆమెకు ‘జూనియర్ సౌందర్య’ అంటూ నామకరణం చేశారు. ఇక సౌందర్య విషయానికి వస్తే.. ఈమె ప్రతి ఒక్కరి మదిలో మెదిలో రూపం. ఎన్నో అపూరమైన పాత్రల్లో నటించి ప్రతి తెలుగు ప్రేక్షకుడి మదిని తాకింది. అసలు సౌందర్యది తెలుగునాడు కాదు. ఆమెది కన్నడ రాష్ట్రం.. అదేనండి కర్ణాటక. అయినా కన్నడనాట కంటే తెలుగులోనే ఆమె ఎక్కువ సినిమాలు చేసింది. అక్కడి కంటే ఇక్కడి ప్రేక్షకుల నుంచే నీరాజనాలు అందుకుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…