Ramya Raghupathi : గత కొద్ది రోజులుగా మళ్లీ పెళ్లి సినిమా ప్రమోషన్ లో భాగంగా నరేష్- పవిత్ర లోకేష్ తెగ హంగామా చేస్తుండడం మనం చూశాం. తమ లివింగ్ రిలేషన్ షిప్ నేపథ్యంలో మళ్లీ పెళ్లి అనే సినిమా చేయగా, విజయకృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.. ప్రముఖ ఫిలిం మేకర్ ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. ఇక మే 26న (శుక్రవారం) ఈ సినిమా విడుదల అయింది. రీసెంట్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తమ రిలేషన్‌షిప్ గురించి అనేక విషయాలు చెప్పుకొచ్చాడు నరేష్. రిలీజ్ ముందు ఆయన మాజీ భార్య రమ్య రఘుపతి ఈ సినిమా విడుదలను ఆపాలంటూ కోర్టును ఆశ్రయించింది.
ఆ సినిమాలోని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె.. ఈ మేరకు కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రతిష్టను కించపరిచేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయంటూ ఆమె ఆరోపించారు. అయితే అందరు కూడా సినిమా విడుదల కాకపోవచ్చని అనుకున్నారు. కాని మూవీ విడుదలై అందరి దృష్టిని ఆకర్షించింది. మూవీకి మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ సినిమాకు తమ జీవితానికి ఎలాంటి సంబంధం లేదని, నరేష్ ఇంటర్వ్యూలలో చెప్పాడు. మళ్లీ పెళ్లి విడుదలకు ఒక్కరోజు ముందు రమ్య దానిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసి సినిమాని ఆపాలని ప్రయత్నించిన అది సాధ్యం కాలేదు.
నరేష్, పవిత్ర రిలేషన్‌షిప్ మీడియాలో వైరల్ అయిన తర్వాత రమ్య రఘుపతి వారిపై హోటల్‌లో దాడి చేయడం మనం చూశాం. ఇదే సమయంలో నరేష్, రమ్య తమ వ్యక్తిగత విషయాలపై ఓపెన్‌గానే విమర్శలు గుప్పించుకున్నారు. ఇటీవలే ఈ వివాదం కాస్త చల్లబడగా.. ‘మళ్లీ పెళ్లి’ సినిమాతో నరేష్ మళ్లీ వేడి రాజేశాడు. చిత్రంలో తన ప్రతిష్టను కించిపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ ఆరోపిస్తుంది రమ్య రఘుపతి. మళ్లీ పెళ్లి’ చిత్రంలో సీనియర్ నటులు జయసుధ, అన్నపూర్ణ, శరత్ బాబుతో పాటు అనన్య నాగళ్ల, వనిత విజయ్ కుమార్, భద్రం తదితరులు నటించారు. ఇక ఈ చిత్రానికి అరుల్ దేవ్, సురేష్ బొబ్బిల మ్యూజిక్ అందించగా.. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ప్రేమలో పడేందుకు వయసుతో సంబంధంల లేదనే కాన్సె్ప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…