Ramya Krishnan : నవరసాలను పోషించి ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకొనే అతికొద్ది మంది నటీమణులలో రమ్యకృష్ణ కూడా ఒకరు. 1990లో వచ్చిన అల్లుడు గారు సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న రమ్యకృష్ణ అక్కడి నుండి జెట్ స్పీడ్‌తో దూసుకుపోయింది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ ఇండస్ట్రీల్లో తనదైన ముద్ర వేసింది. హీరోయిన్‌గా, సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో రమ్యకృష్ణ తనదైన ముద్ర వేసుకుంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ దూసుకుపోతున్నారు. నీలాంబరిగా ఆడియన్స్ మదిలో నిలిచిపోయిన రమ్యకృష్ణ.. ఇక ఇప్పుడు యువతారానికి శివగామిగా దగ్గరయ్యారు.
ప్రస్తుతం రమ్యకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. చివరిగా లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండకి తల్లి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. ఇక తన భర్త దర్శకత్వంలో వస్తున్న రంగ మార్తాండలో నటిస్తున్నారు. ఈ సినిమా నట సామ్రాట్ అనే ఓ మరాఠీ సినిమాకు రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమాతో పాటు రమ్యకృష్ణ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నారు. జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన క్వీన్ వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రలో రమ్యకృష్ణ నటించి.. అదరగొట్టిన సంగతి తెలిసిందే.
ఇక సినిమాలతో పాటు పలు షోస్‌లో రమ్యకృష్ణ మెరుస్తున్న విషయం విదితమే. తెలుగు ఓటీటీ ఆహా ఇటీవల డాన్స్ ఐకాన్ పేరుతో ఓ భారీ డాన్స్ షోను ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా, ఈ కార్యక్రమానికి యాంకర్స్‌గా ఓంకార్, శ్రీముఖి చేస్తున్నారు. ఇక జడ్జ్‌గా రమ్యకృష్ణతో పాటు శేఖర్ మాస్టర్ వ్యవహరిస్తున్నారు. అయితే ఈ డాన్స్ కార్యక్రమానికి జడ్జ్‌గా చేస్తున్నందుకు రమ్యకృష్ణ ఒక్క ఎపిసోడ్‌కు దాదాపుగా రూ.4.5 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటుందని సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. మరి రమ్యకృష్ణ రేంజ్‌కి ఆ మాత్రం ఇవ్వాల్సిందే అంటున్నారు నెటిజన్స్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…