Ramiz Raja : బంగ్లాదేశ్‌తో పాక్ ఓడిపోవ‌డానికి భార‌త్ కార‌ణ‌మ‌ట‌.. ర‌మీజ్ రాజా దుర‌హంకార మాట‌లు..

Ramiz Raja : ప్ర‌స్తుతం పాకిస్తాన్ జ‌ట్టు ప‌రిస్థితి దారుణంగా మారింది. చిన్న చిన్న జ‌ట్ల‌పై కూడా ఓడిపోతూ పరువు పోగొట్టుకుంటుంది. ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు మంచి జరగడం లేదు. గతేడాదిలో పాక్ జట్టు ప్రదర్శన గురించి మాట్లాడితే, వ‌న్డే ప్రపంచ కప్ 2023లో లీగ్ దశ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే, టీ 20 ప్రపంచ కప్ 2024లో గ్రూప్ దశను దాటి ముందుకు సాగలేకపోయింది. టెస్టు క్రికెట్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టు పాకిస్థాన్ పర్యటనలో ఉన్న జ‌ట్టు తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 10 వికెట్ల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోవడం ఇదే తొలిసారి. ఈ చెత్త ప్రదర్శన తర్వాత పాకిస్థాన్‌కు మరో పెద్ద దెబ్బ తగిలింది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు సంబంధించిన తాజా పాయింట్ల పట్టికను ఐసీసీ విడుదల చేయ‌గా, ఇందులో పాకిస్తాన్ 8వ స్థానానికి చేరుకుంది. అంటే, ఇప్పుడు వెస్టిండీస్ జట్టు మాత్రమే పాకిస్థాన్ కంటే తక్కువగా ఉంది. బంగ్లాదేశ్ చేతిలో తమ జట్టు ఓటమికి భారత్ పరోక్ష కారణమని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రమిజ్ రజా ఆరోపించాడు. ఆసియా కప్‌లో తమ ఫాస్ట్ బౌలర్లను భారత బ్యాటర్లు దీటుగా ఎదుర్కొన్న అనంతరం తమ జట్టు పతనం మొదలైందని తెలిపాడు. రావల్పండి వేదికగా జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్‌కు ఊహించని పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. బంగ్లా చేతిలో ఓటమికి తమ జట్టు పేలవ ప్రదర్శన, వ్యూహాలతో పాటు భారత్ కూడా కారణమని రమిజ్ పేర్కొన్నాడు. పాకిస్థాన్ జట్టు ఎంపికలో లోపాలు ఉన్నాయి. స్పిన్నర్ లేకుండా నలుగురు సీమర్లతో బరిలోకి దిగడం పేలవమైన వ్యూహం.

Ramiz Raja comments on Team India after pakistan loss to bangladesh
Ramiz Raja

”అయితే మా పేసర్లపై ఉన్న గొప్ప కీర్తి క్రమంగా తగ్గుతోంది. ఆసియా కప్‌లో పేస్‌కు అనుకూలించే పిచ్‌లపై మా ఫాస్ట్ బౌలర్లను భారత్ దీటుగా ఎదుర్కొంటూ ఆధిపత్యం చెలాయించడంతో ఇది మొదలైంది. అప్పటి నుంచి మా రహస్యాలు ప్రపంచానికి తెలిశాయి. ఇతర జట్లు మాపై కౌంటర్ ఎటాక్ ఇస్తున్నాయి. మరోవైపు మా బౌలర్ల వేగం తగ్గుతూ నైపుణ్యాలపై ప్రభావం పడుతోంది. ఇక మా ఫాస్ట్ బౌలర్ల కంటే బంగ్లాదేశ్ బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేశారు” అని రమిజ్ రజా పేర్కొన్నాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 448/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. మహ్మద్ రిజ్వాన్ (171*), సౌద్ షకీల్ (141) సెంచరీలతో సత్తాచాటారు. షోరిఫుల్, హసన్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 565 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముష్ఫికర్ రహీమ్ (191) తృటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. నసీమ్ షా మూడు వికెట్లు తీశాడు. కాగా, 117 పరుగుల వెనుకంజతో బ్యాటింగ్‌కు వచ్చిన పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 146 స్కోరే సాధించింది. అనంతరం 30 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లా వికెట్ నష్టపోకుండా విజయాన్ని అందుకుంది.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

2 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

2 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

3 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago