Ram Pothineni And Ravi Teja : టాలీవుడ్ స్థాయి రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. మంచి మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కొన్ని సినిమాలు టాలీవుడ్ స్థాయిని రవితేజ ‘మిస్టర్ బచ్చన్’, ఉస్తాద్ రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’ థియేటర్లలోకి వచ్చాయి. రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధిస్తాయని అందరు ఊహించగా, అవి రెండు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ‘మిస్టర్ బచ్చన్’ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 31 కోట్లు. ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 48 కోట్లు. హిందీ సినిమా ‘రైడ్’ స్ఫూర్తితో, అందులోని పాయింట్ తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు, చేర్పులు చేసి ‘మిస్టర్ బచ్చన్’ తెరకెక్కించారు హరీష్ శంకర్. అయితే ఈ సినిమా బోల్తా కొట్టింది.
మొదటి రెండు రోజుల్లో ఏడు కోట్ల షేర్ రాబట్టింది. మూవీ బడ్జెట్‌లో కూడా ఈ మూవీ సగం రాబట్టడం కష్టంగానే మారింది. ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్‌ను వాడుకుందామని డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ వంటి రొటీన్ మాస్ కమర్షియల్ చిత్రాలు వచ్చాయి. వీటితో పాటు విక్రమ్ తంగలాన్ కూడా వచ్చింది. ఈ మూడింటితో పోటీ అని కాదు కానీ.. ఆయ్ అనే మరో సినిమా కూడా వచ్చింది. విచిత్రం ఏంటంటే.. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్‌లు నెగెటివిటీతో బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అన్నాయి. తంగలాన్ అంతో ఇంతో బెటర్‌గా పర్ఫామ్ చేస్తోంది. ఆయ్ మూవీ కూడా మంచి పర్‌ఫార్మెన్స్ ఇస్తుంది.
ఒకప్పుడు మంచి సినిమాలు చేసిన రవితేజ, రామ్‌లు ఎందుకు ఇలాంటి డిజాస్టర్ మూవీలు చేస్తున్నారు. మంచి టాలెంట్ ఉన్న వీరు ఇలాంటి బోరింగ్ మూవీలు చేయడం అభిమానులకి ఏ మాత్రం రుచిచండం లేదు. బోరింగ్ కంటెంట్‌లతో ప్రేక్షకులకి విసుగు తెప్పిస్తున్నారు. ‘మిస్టర్ బచ్చన్’ విజయం సాధించడం రవితేజకు ఎంత ముఖ్యమో… దర్శకుడు హరీష్ శంకర్ కు సైతం అంటే ముఖ్యం. కరోనా, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ముందుకు వెనక్కి వెళ్లడం వల్ల ఆయనకు గ్యాప్ వచ్చింది. పూరి జగన్నాథ్ కు ‘లైగర్’ డిజాస్టర్ నుంచి కోలుకోవడం కోసం ‘డబుల్ ఇస్మార్ట్’ హిట్ కావాలి. కాని ఏది జరగలేదు. ఇద్దరికి కూడా రెండు సినిమాలు మంచి విజయాలు అందిస్తాయని అందరు అనుకున్నా కూడా అవి ఊహించని విజయాన్ని అందుకోపోగా దారుణమైన పరాజయాన్ని తెచ్చిపెట్టాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…