Ram Gopal Varma : కొత్త చాన‌ల్‌ను ప్రారంభిస్తున్న వ‌ర్మ‌.. బ‌ట్ట‌ల‌ను ఊడ‌దీస్తాడ‌ట‌..!

Ram Gopal Varma : సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఎప్పుడు ఏం చేస్తాడో ఎవ‌రికి అర్ధం కాదు. ఎవ‌రిని తిడ‌తాడో, ఎవ‌రిని స‌పోర్ట్ చేస్తాడో కూడా అర్ధం చేసుకోవ‌డం క‌ష్టం. ఒక‌ప్పుడు టాలీవుడ్ సినిమా రూపు రేఖ‌లు మార్చేసిన ఆర్జీవి ఇటీవ‌లి కాలంలో పెద్ద‌గా స‌క్సెస్ అందుకోలేక‌పోతున్నాడు. అయితే యూట్యూబ్ ఛానెల్ తో అప్పుడ‌ప్పుడు సంద‌డి చేస్తూ ఉండే వ‌ర్మ .. ఇప్పుడు ‘నిజం’ పేరుతో మరో యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభిస్తున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనకున్న నిజానిజాలను తవ్వి తీయడమే తన ‘నిజం’ ఛానెల్ ముఖ్యోద్దేశం అంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు.

మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేస్తూ… అలాగే, ట్విట్టర్ ద్వారా వరుస ట్వీట్లతో వివరించారు. ఈ చానల్ ప్రారంభోత్సవానికి ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. తన యూట్యూబ్ చానల్ ముఖ్య ఉద్దేశం అబద్ధాల బట్టలు ఊడదీసి నిజాన్ని ఆవిష్కరించడమేనని వర్మ తెలిపారు. ‘నిజం’ యూట్యూబ్ చానల్ లో కేవలం పొలిటికల్ కాంట్రవర్సీలు మాత్రమే కాకుండా, కొన్ని కరెంట్ సిట్యుయేషన్స్, సైన్స్, హిస్టరీ, కృత్రిమ మేథ, సెక్స్, ఫిలాసఫీ, పోలీస్, క్రైమ్, న్యాయస్థానాలు… ఇలా ఎన్నెన్నో టాపిక్స్ ఉంటాయని ఆయ‌న తెలియ‌జేశారు.

Ram Gopal Varma starts nijam channel
Ram Gopal Varma

ఇక సీనియర్ పాత్రికేయురాలు స్వప్న కూడా కొన్ని ఎపిసోడ్స్ లో పాల్గొంటారని, కొన్ని అంశాలను తాను విశ్లేషిస్తానని, కొన్ని అంశాలు స్వప్న విశ్లేషిస్తారని వర్మ వెల్లడించారు. నిజాన్ని గౌరవించే ప్రతి ఒక్కరికీ ‘నిజం’ చానల్ గొడుగు కింద ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొన్నారు. తన యూట్యూబ్ చానల్ లో తొలి ఎపిసోడ్ ను ‘వివేకా హత్య వెనుక నిజంలో అబద్ధముందా?’ అనే టాపిక్ పై ఉంటుందని వెల్లడించారు. తన చానల్ లోగోను కూడా వర్మ ఆవిష్కరించారు. నిజాన్ని చంపడానికి ప్రయత్నించడం కోసమే అబద్ధం బతుకుతుందని.. కానీ నిజాన్ని ఎవ్వరూ చంపలేరని పేర్కొన్నారు. కానీ, నిజం అప్పుడప్పుడూ చచ్చిపోయినట్టు నటిస్తుందని.. దానికి మోసపోయి, చచ్చింది అని అబద్ధాలు చెప్పే వాళ్లు సంబరంతో డాన్సులు చేస్తుంటే ఏదో ఒక రోజు అది వెనుక నుంచి ముందుపోటు పొడుస్తుందని తనదైన శైలిలో వర్మ వివరించారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago