Ram Gopal Varma : వాల్తేరు వీరయ్య మూవీ 200 రోజలు ఫంక్షన్‌లో చిరంజీవి కొన్నిసంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లపై ఎందుకు పడి ఏడుస్తారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా సినిమాల గురించి మాట్లాడడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. దీనిపై వైసీపీ నాయకులు ఎలా రియాక్ట్ అయ్యారో మనం చూశాం. ఇక తాజాగా రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభలో విజయ్ సాయిరెడ్డి చేసిన కామెంట్స్ గురించా, లేదంటే బ్రో విషయంలోనా అనేది నాకు క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నారు కాబట్టి ఆయన ఏపీ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. చిరంజీవి ఏ సందర్భం గురించి మాట్లాడారనేది తెలియడం లేదు అని వర్మ చాలా క్లారిటీగా సమాధానం ఇచ్చారు.
సోషల్ మీడియాలో మాత్రం చిరంజీవిపై తెగ సెటైర్స్ వేస్తున్నారు చిరు. మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రం శుక్రవారం రోజు థియేటర్స్ లో విడుదలయింది. ఎవరిని ఈ చిత్రం అలరించలేకపోవడంతో భోళా శంకర్ పై ట్రోలింగ్ స్థాయి మరింత పెరిగింది. ఆ మధ్యన భోళా శంకర్ రిలీజ్ కి ముందు చిత్రు వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో చిరు ఎపి ప్రభుత్వంపై కొన్ని కామెంట్స్ చేశారు. ప్రజా సమస్యలపై ద్రుష్టి పెట్టకుండా టాలీవుడ్ పై ఏపీ ప్రభుత్వం.. పిచ్చుక పై బ్రహ్మాస్త్రం అన్నట్లుగా వ్యవహరిస్తోంది అంటూ ఘాటైన కామెంట్స్ చేశారు. అప్పటి నుండడి రాంగోపాల్ వర్మ చిరంజీవిని టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి వర్మ తన నోటికి పని చెబుతూ చిరంజీవిపై దారుణమైన ట్రోలింగ్ చేశాడు.
చిక్కిందే అవకాశం అన్నట్లుగా వర్మ వాల్తేరు వీరయ్య చిత్రం విజయం చిరంజీవి క్రెడిట్ కాదు అన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. దీనికోసం రవితేజని పరోక్షంగా ఈ వివాదంలోకి లాగాడు. ‘ వాల్తేరు వీరయ్య చిత్రం ఎవరి మూలాన ఆడిందో , ప్రూవ్ చేయడానికే భోళా శంకర్ చిత్రం తీసినట్లు ఉన్నారు’ అంటూ వర్మ ట్వీట్ చేశారు. దీనితో మెగా ఫాన్స్ వర్మపై మండి పడుతున్నారు. చిరంజీవిపై ఈ స్థాయి విద్వేషం ఎందుకు అంటూ వర్మని ప్రశ్నిస్తున్నారు. వర్మ కూడా ఇండస్ట్రీ వల్లే ఎదిగిన వ్యక్తి అని గుర్తుంచుకోవాలని అంటున్నారు. అంతకు ముందు వర్మ.. జబర్దస్త్, హైపర్ ఆది లాంటి వారి పొగడ్తలకు అలవాటు పడి రియాలిటీకి దూరం అవుతున్నారు అంటూ కామెంట్స్ చేశాడు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…