Ram Gopal Varma : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక్కోసారి అర్ధరహిత కామెంట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తూ ఉంటారు. కొన్ని సార్లు సమాజంలో జరుగుతున్న సమస్యలపై స్పందిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంటారు. కొద్ది రోజుల క్రితం అంబర్‌పేటలో వీధి కుక్కల దాడి జరగగా, ఇందులో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ ప్రాణాలు కోల్పోయిన ఘటన అందర్నీ కలిచివేసింది. ఈ ఘటనపై నలువైపుల నుంచి పాలకవర్గంపై ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై తాజాగా ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తీవ్రంగా స్పందించారు. వీధి కుక్కల నియంత్రణలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విఫలమైందంటూ విమర్శిస్తూ ఫైర్ అయ్యారు.
కుక్కలకు ఆకలి వేయడం వల్లే చిన్నారిపై దాడి చేశాయి అని హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇచ్చిన వివరణపై రాంగోపాల్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. గతంలో విజయలక్ష్మి తన పెంపుడు కుక్కతో కలిసి ఉన్న వీడియోను షేర్ చేస్తూ మండిపడ్డారు . ‘కుక్కల నుంచి ప్రజలకు హాని కలగకుండా ఉండాలంటే మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి నా ఆలోచన చెబుతా. నగరంలోని అన్ని శునకాలకూ ఈ వీడియో చూపిస్తే.. ఆకలి వేసినప్పుడల్లా, చిన్నారులపై దాడి చేయకుండా మేయర్ ఇంటికి వెళ్తాయి. అలాగే, ఇలాంటి హృదయ విదారక వీడియోను ఆమెకు తరచూ చూపించాలి. అప్పుడు ఆమె చెత్త సలహాలు ఇవ్వకుండా ఉంటారు’ అంటూ కొంత ఘాటుగా స్పందించారు ఆర్జీవి.
‘కేవలం మేయర్ మాత్రమే కాదు. అందరూ ఆ స్థానంలో మీ పిల్లలను కూడా ఊహించుకోండి. 2021లో గద్వాల్ విజయలక్ష్మి పెట్టిన వీడియో ఇప్పుడు 2023లో భయానక స్థితికి చేరింది. చిన్నారిపై దాడి చేసిన కుక్కలకు బహుశా ఆమే శిక్షణ ఇచ్చి ఉంటారన్న అనుమానం కూడా కలుగుతోంది. మంత్రి కేటీఆర్, హైదరాబాద్ పోలీసులు దీనిపై తప్పక విచారణ చేయాలి. ఇంత జరిగినా ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ గద్వాల్ విజయలక్ష్మి తన మేయర్ పదవికి ఎందుకు రాజీనామా చేయకుండా ఉంది? ఆ కుక్కలను మీ ఇంటికి తీసుకెళ్లి వాటికి ఆహారం పెట్టవచ్చు కదా! అప్పుడు అవి మన పిల్లలను ఏమి చేయకుండా ఉంటాయి. కేటీఆర్ సర్ దయచేసి నగరంలో ఉన్న 5 లక్షల కుక్కలను డాగ్ హోంకు తరలించి.. వాటి మధ్యలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని వదిలేయండి అంటూ రామ్ గోపాల్ వర్మ నిప్పులు చెరిగారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…