Ram Charan Shirt Price : మెగా పవర్ స్టార్ నుండి గ్లోబల్ స్టార్‌గా మారాడు రామ్ చరణ్.. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆయన క్రేజ్ పీక్స్ కి వెళ్లింది. గ్లోబల్ స్టార్ ఇమేజ్ పొందిన చరణ్‌కు ఈ సారి పుట్టినరోజు స్పెషల్ అనే చెప్పొచ్చు. ఈ మేరకు మెగా ఫ్యాన్స్, పలువురు సినీ సెలబ్రిటీస్ సోషల్ మీడియా వేదికగా తనకు విషెస్ తెలిపారు. ఇక సోమవారం సాయంత్రం కొంతమంది స్టార్ సెలబ్రిటీల కోసం ప్రత్యేకంగా బర్త్‌డే పార్టీ ఏర్పాటు చేశాడు చరణ్. ఈ వేడుకలకు దర్శక దిగ్గజం రాజమౌళి ఫ్యామిలీ, మంచు లక్ష్మి, మనోజ్ సహా విజయ్ దేవరకొండ, సిద్ధు జొన్నలగడ్డ, నిఖిల్ తదితరులు హాజరై తెగ సందడి చేశారు.
అయితే బర్త్ డే వేడుకలో రామ్ చరణ్ ధరించిన అవుట్‌ఫిట్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి వైవీస్ సెయింట్ లారెంట్ బ్రాండ్‌కు చెందిన ఈ షర్ట్ ఆర్గానిక్ సిల్క్‌తో తయారు చేయబడగా, బ్లాక్-థ్రెడ్ ఎంబ్రాయిడరీతో సెల్ఫ్-డిజైన్ కలిగి ఉండి మెరిసిపోతూ ఉంది. ప్రస్తుతం దీని ధర దాదాపు $1550. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.80,961 అని తెలుస్తోంది. ఇక ఈ కాస్ట్ చూసి అభిమానులు.. వామ్మో అనుకుంటున్నారు. ‘ఇదే డబ్బులు పెడితే ఓ పదిపదిహేనేళ్ల పాటు షర్ట్స్ కొనుక్కోవచ్చు’ అని కామెంట్స్ పెడుతున్నారు. అయితే చరణ్ దీన్ని ధరించిన విధానంతో మరింత క్లాస్ లుక్ సంతరించుకుంది.
![Ram Charan Shirt Price : బర్త్ డే రోజు స్టైలిష్ షర్ట్ ధరించిన రామ్ చరణ్.. రేటు తెలిస్తే బిత్తరపోవల్సిందే..! Ram Charan Shirt Price you will be surprised to know](http://3.0.182.119/wp-content/uploads/2023/03/ram-charan-shirt-price.jpg)
రామ్ చరణ్ కొద్ది రోజుల క్రితం ఆస్కార్ వేడుకల కోసం అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సమయంలోనే వీరి షాపింగ్ పిక్స్ వైరల్ నెట్టింట వైరల్ కాగా.. అప్పుడే చరణ్ కోసం ఉపాసన ఈ షర్ట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఇక రామ్ చరణ్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఇటీవల కాలంలో రామ్ చరణ్‌కి అన్ని గుడ్ న్యూస్ లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చేస్తున్న RC15 టైటిల్, ఫస్ట్ లుక్‌ను బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఈ చిత్రానికి ‘గేమ్ చేంజర్’ టైటిల్ ఫిక్స్ చేశారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా.. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.