Ram Charan : రామ్ చరణ్, ఉపాసన దంపతులకి జూన్ 20న పండంటి ఆడబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. పదేళ్ల నిరీక్షణకి తెరపడడంతో ఫ్యాన్స్ కుటుంబ సభ్యులు అందరు సంతోషంగా ఉన్నారు. మెగా కుటుంబంలోకి కొత్త వ్యక్తి అడుగుపెట్టడంతో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇక జూన్ 30న మెగా ప్రిన్సెస్‌కు బారసాల వేడుక ఘనంగా జరిగింది. మెగా వారసురాలికి క్లిన్ కారా అని పేరు కూడా పెట్టారు. అయితే అసలు ఆ పేరుకు అర్థమేంటో తెలుసుకునేందుకు చాలామంది ప్రయత్నించగా, లలితా సహస్రనామం నుండి తీసుకున్నామని తెలిపారు చిరంజీవి. లలితా సహస్రనామంలోని 125వ పాదంలోనుంచి తీసుకున్నామని, దాని నుండి ఆమె తన కుమార్తెకు క్లీన్ కారా అని పేరు పెట్టినట్లు తెలిపారు.
అసలు ఈ పేరు ఎందుకు తీసుకోవాలని అనిపించిందని కూడా కొందరు ఆలోచనలు చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆ పేరు సూచిందింది మాత్రం ఉపాసన తల్లి శోభనా కామినేని అని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉపాసన.. నువ్వు పుట్టినప్పుడు నీకు క్లిన్ కారా అని పేరు పెట్టాలని అనుకున్నాను. కానీ అది సాధ్యం కాలేదు. రామ్ చరణ్- ఉపాసనలకు అభినందనలు, మీ ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన ఈ బిడ్డ మన భవిష్యత్తును మార్చే శక్తి. లవ్ యూ కారా అని పోస్ట్ చేశారు ఉపాసన తల్లి శోభనా కామినేని. దీనికి ఉపాసన కూడా పాజిటివ్‌గా స్పందించింది.
అయితే ప్రస్తుతం ఉపాసన తన తల్లి దగ్గరే ఉన్నట్టు తెలుస్తుంది. ఇక రామ్ చరణ్ కూడా అక్కడే ఉన్నాడట. పాప పుట్టిన దగ్గర నుండి పాప బాగోగులు అన్నీ కూడా తానై చూసుకుంటున్నాడట. ఇంట్లో పని వాళ్లు ఉన్నా కూడా తన సొంత కూతురికి సంబంధించిన పనులు స్వయంగా తానే చూసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు రామ్ చరణ్. ఇక భార్యకి సంబంధించిన కొన్ని పనులు కూడా రామ్ చరణ్ చేస్తున్నాడట. ఏదేమైన రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోను రామ్ చరణ్ మంచి తండ్రి, భర్తగా నిరూపించుకుంటున్నాడు.