Satyam Rajesh : కమెడియన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలలో నటించి మెప్పించిన నటుుడు సత్యం రాజేష్. రెండేళ్ల ముందు విడుదలైన మా ఊరి పొలిమేర చిత్రంలో ఆయన చేసిన గ్రే క్యారెక్టర్ అందరికీ గుర్తుండి పోయింది. ఎంతలా అంటే దాదాపు రెండేళ్లు అవుతున్నా కూడా ఆ సినిమా సీక్వెల్ కోసం ఎదురు చూసేంతగా. ప్రేక్షకులకు కూడా పొలిమేర 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే త్వరలోనే ఈ వెయిటింగ్‌కు తెర దించేస్తామని చెబుతున్నారు దర్శకుడు అనిల్ విశ్వనాథ్, నిర్మాత గౌరి కృష్ణ. చేతబడి నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తుంది.
కాకులు, చేతబడులు కాన్సెప్ట్ తో వచ్చిన బలగం, విరూపాక్ష సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. తాజాగా చేతబడుల కాన్సెప్ట్ తోనే పొలిమేర 2 విడుదలకి సిద్ధంగా ఉంది..ఇటీవల వరుణ్ తేజ్ చేతుల మీదుగా టీజర్ విడుదలైంది. ఒకే ఒక్క డైలాగ్ పెట్టి.. చేతబడుల సన్నివేశాలతో టీజర్ ను కట్ చేశారు. మొదటి పార్ట్ లో చనిపోయినట్టుగా కనిపించిన సత్యం రాజేశ్.. ఈ టీజర్లో చేతబడులు చేసేవాడిగా కనిపించాడు. ప్రియురాలితో పారిపోయిన సత్యంరాజేశ్.. అక్కడక్కడా చేతబడులు చేస్తుంటాడు. ప్రాణం తీయడం తప్పుకదా అని ఒక మహిళ అంటే.. ప్రాణం తీయడం తప్పు.. బలివ్వడంలో తప్పేంటి అని ఒక వ్యక్తి చెప్పడం సినిమాపై ఆసక్తిని పెంచుతుంది.
చివర్లో సత్యం రాజేష్ చేతబడి చేస్తూ రక్తంతో అభిషేకం చేసుకోవడం చూపించారు. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన పొలిమేర 2 ని ఈసారి ఓటీటీలో కాకుండా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే సత్యం రాజేష్ తన అనుభవాల గురించి ప్రెస్ మీట్లో తెలియజేశాడు. చీకటి గదిలో ఉంచారు. ఎవరు కనపడట్లేదు. ఎవరైన ఉన్నారా అంటే ఉన్నామని అంటున్నారు. దూరంలో స్మశానంలో చితి కాలుతుంది. అక్కడ చేతబడి ముగ్గు వేయించారు. కప్ప గుండె కొట్టుకుంటుంది. ఆ సమయంలో నన్ను డైలాగ్స్ చెప్పమంటున్నారు. చాలా వణుకు పుట్టింది. చూడ్డానికి కామెడీగానే ఉన్నా సెట్స్ లో చాలా భయపడ్డాం అని సత్యం రాజేష్ చెప్పుకొచ్చున్నారు.