Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌డమ్‌ని సంపాదించుకున్న విషయం తెలిసిందే. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న రామ్ చరణ్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్‌లపై దృష్టి సారిస్తున్నాడు. చరణ్ గతంలో ఒక పోలో టీమ్ ని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ట్రూ జెట్ పేరుతో విమానయాన సంస్థను నడిపించాడు. ఓ వైపు నటిస్తూనే మెగా పవర్ స్టార్ నిర్మాతగా మారి సినిమాలను ప్రొడ్యూస్ చేశాడు. ఇలా విభిన్నరంగాల్లో రాణిస్తున్న చరణ్ తాజాగా క్రీడారంగంలో మరో అడుగుముందుకేశాడు.
ఐపీఎల్‌పై కన్నేసిన రామ్ చరణ్ వచ్చే ఏడాది ఓ కొత్త ఐపీఎల్ టీమ్ ను మనకు పరిచయం చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని..వచ్చే ఏడాది ఐపీఎల్ లో రాంచరణ్ ఫ్రాంచైజీ నుంచి వైజాగ్ వారియర్స్ టీమ్ అడుగుపెట్టనుంది. గత ఏడాది ఐపీఎల్ లో గుజరాత్, లక్నో ఫ్రాంచైజీలు అడుగుపెట్టాయి. తెలంగాణ నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఉంది కనుక ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఒక్క టీమ్ కూడా లేని కారణంగా రామ్ చరణ్ వైజాగ్ వారియర్స్ పేరిట ఒక కొత్త ఐపీఎల్ టీంని సిద్ధం చేయబోతున్నాడని టాక్.
ఇప్పటికే వందల కోట్ల పెట్టుబడితో షారుఖ్ ఖాన్, ప్రీతి జింటా, శిల్పా శెట్టి వంటి వారు పలు టీమ్ లకు ఫ్రాంచైజీ యజమానులుగా ఉన్నారు. ఐపీఎల్ బిజినెస్ అంటే వందల కోట్లలో ఆదాయం ఉంటుంది. అసలు ఐపీఎల్ ను మించిన బిజినెస్ మరొకటి లేదు. అందుకే రామ్ చరణ్ కూడా దీనిపై ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా భిన్నమైన నేపథ్యంలో రామ్ చరణ్ కనిపించబోతున్నారు. గేమ్ చేంజర్ అనే పేరు ఖరారు చేశారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శంకర్ దర్శకత్వంలో సినిమా పూర్తిచేసిన తర్వాత ఉప్పెన ఫేం సానా బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటించనున్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…