Rajinikanth : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టై ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్‌పై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబును కలిసేందుకు రజనీకాంత్ రాజమండ్రి వస్తారన్న ప్రచారం గత రెండ్రోజులుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఆదివారంనాడు తమ కుటుంబ కార్యక్రమంలో పాల్గొనేందుకు చెన్నై విమానాశ్రయం నుంచి కోయంబత్తూరుకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిని కలిసేందుకు ఎప్పుడు వెళ్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. చంద్రబాబును కలిసేందుకు వెళ్లాలని అనుకున్నానని, అయితే, ఫ్యామిలీ ఫంక్షన్ కారణంగా అది కుదరలేదని రజనీ కాంత్ చెప్పారు.
ఇందుకు సంబంధించిన వీడియోను ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది. చంద్రబాబు నాయుడు అరెస్టు విషయం తెలుసుకున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఫోన్ చేసి పరామర్శించిన విషయం తెలిసిందే. నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాటయోధుడు, చేసిన అభివృద్ధి, సంక్షేమమే చంద్రబాబుకు రక్ష. ధైర్యంగా ఉండాలని, త్వరలోనే నా మిత్రుడు బయటకు వస్తారని రజనీకాంత్ అన్నారు. అయితే, సోమవారం రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అయ్యేందుకు రజనీకాంత్ వస్తారని ప్రచారం జరిగింది.
ఇక మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ను సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు లో ఉన్నారు. అయితే, చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు అరెస్టు విధానం సరికాదంటూ పలువురు ప్రముఖులు పేర్కొంటూ ఆయనకు మద్దతు తెలుపుతూ వస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్ తో పాటు విదేశాల్లోని పలు ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగులుసైతం రోడ్లపైకొచ్చి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ర్యాలీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…