Rajasekhar : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో సముద్రఖని తెరకెక్కించిన చిత్రం బ్రో. ఈ చిత్రం తమిళ మూవీకి రీమేక్‌గా రూపొంది మంచి విజయమే సాధించింది. తొలి రోజు ఈ మూవీకి కలెక్షన్ల వర్షం కురిసింది… నైజాం (తెలంగాణ).. రూ. 8.45 కోట్లు.. సీడెడ్ (రాయలసీమ).. రూ. 2.70 కోట్లు.. ఉత్తరాంధ్ర.. రూ. 2.60 కోట్లు.. తూర్పు గోదావరి.. రూ. 2.45 కోట్లు.. పశ్చిమ గోదావరి.. రూ. 2.98 కోట్లు.. గుంటూరు.. రూ. 2.51 కోట్లు.. కృష్ణ.. రూ. 1.21 కోట్లు.. నెల్లూరు.. రూ. 71 లక్షలు.. ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 23.61 కోట్లు.. (రూ. 35.50 కోట్లు గ్రాస్) రాబట్టింది. కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ .. రూ. 2.10 కోట్లు.. ఓవర్సీస్.. రూ. 4.30 కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా తొలి రోజు రూ. 30.01 కోట్లు ( రూ. 48.50 కోట్లు గ్రాస్) వసూళ్లను రాబట్టింది.
బ్రో సినిమా 97.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 98.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు రూ. 68.49 కోట్ల దూరంలో ఉంది. ఈ సినిమాకు పవన్ కేవలం 21 రోజుల మాత్రమే డేట్స్ కేటాయించారు. అన్ని రోజులకుగాను పవన్ కళ్యాణ్ రూ. 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించిన ఈ సినిమాలో తొలిసారి మేనమామ, మేనల్లుడు అయిన పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ సాధించడం సులభమే అనిపిస్తుంది.
అయితే సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా మూవీపై ప్రశంసలు కురిపించారు. రాజశేఖర్ ఫ్యామిలీ కూడా చిత్రాన్ని చూసినట్టు తెలుస్తుండగా, చిత్రంలో దేవుడిగా పవన్ కళ్యాణ్‌ని బాగా చూపించారంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాజశేఖర్ కూడా ఇదే కామెంట్ చేశాడని అంటున్నారు. ఇక ఈ సినిమాపై సినిమా పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. చిత్రంలో పవన్ తో పాటు సాయిధరమ్ తేజ్ పర్‌ఫార్మెన్స్ అదిరిపోయిందని అన్నారు.