Pushpa Sreevani : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రీసెంట్‌గా కురుపాం గ్రామంలో పర్యటించిన విషయం తెలిసిందే. పార్వతీపురం మన్యం జిల్లా… కురుపాం మండలంలో ఆయన విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో అమ్మఒడి పథకం నాలుగో విడత నిధులు విడుదల చేశారు. పిల్లలందరినీ బడికి పంపించాలని కోరిన సీఎం జగన్ … విద్యారంగంలో 4 ఏళ్లుగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేందుకు వీలుగా ఎన్నో చర్యలు తీసుకున్నామన్నారు. గోరుముద్ద, నాడు నేడు కార్యక్రమాలతోపాటూ… పిల్లలకు ట్యాబ్స్ కూడా ప్రభుత్వం అందిస్తోందని జగన్ తెలిపారు. ఆడ పిల్లల కోసం స్వేచ్ఛ అనే పథకాన్ని తెచ్చామన్నారు.
ఇక అదే కార్యక్రమంలో పుష్ప శ్రీవాణి తన పవర్ ఫుల్ స్పీచ్‌తో అదరగొట్టింది. విపక్షాలపై అడుగడుగునా పంచులేస్తూ తన స్పీచ్‌తో అదరగొట్టింది శ్రీవాణి.విపక్షాలు అన్నీ కలసి జగన్ని టచ్ చేయాలని చూస్తున్నాయని కానీ ఆయన నీడను కూడా తాకలేరంటూ పుష్ప శ్రీవాణి స్పష్టం చేశారు. ఆరు కోట్ల మంది ఆంధ్రుల గుండెలలో జగనన్న గూడు కట్టుకుని ఉన్నారని ఆయనని సీఎం సీటు నుంచి అంగుళం కూడా కదల్చడం ఎవరి వలన కాదు అని శ్రీవాణి చెప్పుకొచ్చింది. మరోవైపు మాజీ సీఎం చంద్రబాబుకు ఆమె పంచులు పేల్చారు.
జగన్ పథకాలు ఆలోచనలను కాపీ కొట్టవచ్చేమో కానీ బాబూ జగన్ కమిట్ మెంట్ ని ప్రజల పట్ల ఉన్న ఆయన తపనను, ప్రతీ పధకాన్ని నిక్కచ్చిగా అమలు చేసే నైజాన్ని ఎప్పటికీ కాపీ కొట్టలేరని, అది ఆయన వల్ల కూడా కాదంటూ ఆమె స్పష్టం చేశారు. అటు యువగళం ఇటు నారాహి యాత్ర ఏదైనా కూడా జగన్ ప్రజా బలం ముందు బలాదూర్ అంటూ పుష్ప శ్రీవాణి అదరగొట్టింది. శ్రీవాణి మాటలకి ఆ ప్రాంగణంలో ఉన్న వారంతో చప్పట్ల వర్షం కురిపించారు. జగన్ సమక్షంలో ప్రతిపక్షాలకి గట్టిగా ఇచ్చి పడేశావు అంటూ వైసీపీ నాయకులు కూడా ఆమెని ప్రశంసిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…