Nikhil : ‘కార్తికేయ 2’ మూవీ తర్వాత ఇండియా వైడ్‌గా గుర్తింపు పొందిన హీరో నిఖిల్ సిద్ధార్థ్ తాజాగా స్పై అనే పాన్ ఇండియా చిత్రంతో నేడు ప్రేక్షకులని పలకరించాడు. ఈడీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజశేఖర్ రెడ్డి కె నిర్మించారు. ఐశ్వర్య మీనన్ కథానాయిక. ఆర్యన్ రాజేష్, మకరంద్ దేశ్‌పాండే, అభినవ్ గోమఠం తదితరులు కీలక పాత్రలు పోషించారు. విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకూర్చగా.. శ్రీచరణ్ పాకాల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. అయితే సాధారణంగా స్పై సినిమాల్ని థ్రిల్లింగ్ స్టోరీలైన్, భారీ యాక్షన్ సన్నివేశాలు, హీరోయిజం హంగులతో చివరి వరకు ఎంగేజింగ్‌గా నడిపించడం చాలా ముఖ్యం.
అంతర్లీనంగా దేశభక్తిని కూడా చూపించాలి. అవన్నీ సమపాళ్లలో కుదిరినప్పుడే స్పై సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పించే ఆస్కారం ఉంటుంది. ఇందులో ఏ ఒక్క అంశం మిస్సయినా మొదటికే మోసం వస్తుంది. స్పై చిత్రం విషయంలో అదే జరిగింది. ఇప్పుడొస్తున్న స్పై సినిమాలకు భిన్నంగా సీరియస్ గా కాకుండా కమర్షియల్ పంథాలో కామెడీ, రొమాంటిక్ యాంగిల్ కూడా మిక్స్ చేయడంతో సినిమా మొత్తం గందరగోళంగా మారిపోయింది. సినిమాలో ఏం జరుగుతుందో, కథ ఎటు వెళుతుందో తెలియక ప్రేక్షకుడిని కన్ఫ్యూజన్‌లో పడేసింది.
స్పై మూవ పేరుకే పేరుకే స్పై థ్రిల్లర్ మూవీ కానీ ఆడియెన్స్‌ను థ్రిల్ చేసే హై మూవ్‌మెంట్స్ ఒక్కటంటే ఒక్కటి కూడా సినిమాలో కనిపించదు. యాక్షన్ సన్నివేశాల్లో కొత్తదనం లేదు.ఈ సినిమా కోసం నిఖిల్ పడ్డ కష్టం అంతా వృధా అయింది. యాక్షన్ రోల్‌కు న్యాయం చేసేందుకు నిఖిల్ చాలా కష్టపడ్డాడు. ఆర్యన్ రాజేష్ మూడు సీన్స్, రానా ఒక్క సీన్‌కు పరిమితమయ్యారు. చిత్రం ఇలాంటి తేడా కొట్టడంతో నిఖిల్ చాలా బాధలో ఉన్నాడు. తన సన్నిహితుల దగ్గర సినిమా ఫ్లాప్ అయినందుకు బాధపడుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సారి మాత్రం కాస్త గ్యాప్ తీసుకొని అయిన మంచి హిట్ ఇవ్వాలనే కసితో నిఖిల్ ఉన్నాడట.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…