Pushpa 2 Scene : సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ డూపర్ హిట్ చిత్రం పుష్ప. ఈ చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప2 అనే చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. పుష్ప పార్ట్ 1 సెన్సేషనల్ హిట్ అవడంతో పార్ట్ 2 పై కూడా అంచనాలు తారస్థాయికి చేరాయి. దీంతో పుష్ప 2 కు సంబంధించి ఏ చిన్న న్యూస్ వచ్చినా కూడా అది క్షణాలలో వైరల్ అవుతుంది. అయితే కొద్ది రోజులుగా పలు సూపర్ హిట్ చిత్రాలకి సంబంధించి లీకుల పర్వం కొనసాగుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కూడా ఎవరో ఒకరు షూటింగ్ సమయంలో ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తూనే వస్తున్నారు.
ప్రస్తుతం పుష్ప 2 మూవీ చిత్రీకరణ పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం గుడ్డు గూడెం లో జరుగుతోంది. అయితే ఈ లొకేషన్ ఓపెన్ ప్లేస్ కావడంతో షూటింగ్ చూడ్డానికి చుట్టుపక్కల ఊర్లో నుంచి భారీగా జనాలు తరలివచ్చారు. అందులో ఒకరు మూవీ షూటింగ్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. . ఈ క్రమంలో షూటింగ్‍కు సంబంధించిన ఓ వీడియో లీకైంది. ఎర్ర చందనం దుంగలు ఉన్న లారీలు నదిలో వేగంగా వెళుతున్నట్టు వీడియోలో ఉంది. ఆ లారీలను వెంబడిస్తూ జీపులు వెనకాలే వస్తున్నాయి. ఈ షూటింగ్ ను కొందరు మొబైళ్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ విజువల్స్ చూస్తుంటే.. సినిమాలో ఇది కీలకమైన సీన్‍గా ఉండేలా కనిపిస్తోంది. నదిలో లారీలు, జీప్‍లతో చేజింగ్ ఆసక్తికరంగా ఉంది. ఈ వీడియో నెటిజన్స్‌ని తెగ ఆకట్టుకుంటుంది.
ప్రస్తుతం పుష్ప2 మూవీ చిత్రీకరణ శరవేగంగా సాగుతుంది. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. బన్నీ కూడా ఈసారి గ్లోబల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకోవాలని ఈ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా.. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ లతో పాటూ సీనియర్ నటుడు జగపతిబాబు పార్ట్ 2 లో మరో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…