Pushpa 2 Dialogue : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం పుష్ప. ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో బన్నీ క్రేజ్ పూర్తిగా మారిపోయింది. ఇక ఇటీవల పుష్ప చిత్రాన్ని రష్యాలోనూ రిలీజ్ చేయగా, అక్కడ కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. ఇదిలా ఉంటే పుష్ప చిత్రానికి సిక్వెల్ గా రాబోతున్న పుష్ప 2పై కూడా ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఓకేసారి అన్ని భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు భారీ సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 మూవీలో రష్మిక కథానాయికగా నటిస్తుండగా.. సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. అయితే ఈ మూవీ నుంచి అల్లు అర్జున్ చెప్పే కొన్ని డైలాగ్స్ లీకయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ డైలాగ్ ఇదే నంటూ సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరలవుతున్నాయి. ”అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేసాయంటే పులి వచ్చిందని అర్ధం.. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప రాజ్ వచ్చాడని అర్ధం” ఈ డైలాగ్ విని ఫ్యాన్స్ తెగ రచ్చ చేస్తున్నారు.
అవతర్ 2 సినిమాతోపాటు పుష్ప 2 గ్లింప్స్ ని ప్రదర్శించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఈ డైలాగ్ వినిపించే అవకాశం వుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 17, 18, 19 తేదీలలో పుష్ప 2 షూటింగ్ సికింద్రాబాద్ లోని ఒక గవర్నమెంట్ కాలేజీ లో జరగనుందట. భారీ స్థాయిలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా లో తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి నటించనున్నట్లుగా టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తలపై త్వరలోనే క్లారిటీ రానుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…