Purandeshwari : ఏపీ రాజకీయాలు ఈ సారి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు 8 నెలలు ముందుగానే రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి పార్టీల పొత్తులు ఎలా ఉండబోతున్నాయి? బీజేపీ-టీడీపీ భాగస్వామ్యం మళ్లీ రిపీట్ అవుతుందా?. బీజేపీ-జనసేన మైత్రిలో ఏమైనా మార్పులు ఉంటాయా.. ఇలా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఇక ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియామకం రాజకీయ సమీకరణాల్లో మార్పులు తీసుకొస్తుందా? అని రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్న వేళ ఏపీ బీజేపీ నూతన చీఫ్ పురంధేశ్వరి మీడియా మందు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పష్టం చేశారు. రాజమండ్రిలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ, జనసేన పార్టీల సీఎం అభ్యర్థిని పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. రానున్న రోజుల్లో ఇతర పార్టీలతో పొత్తుల విషయమై అధిష్టానానిదే తుది నిర్ణయమని పురంధేశ్వరి ప్రకటించారు. జనసేన అధినేత పవన్‌తో సోమువీర్రాజు మాట్లాడుతూనే ఉండేవారని, అదేవిధంగా జనసేనతో సమన్వయంతో ముందుకు వెళ్తామని పురంధేశ్వరి అన్నారు. జనసేన తమకు ఎప్పటికీ మిత్ర పక్షమేనని తద్వారా జనసేన-బీజేపీ మైత్రి విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని ఆమె స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి సహకారం అందుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిధులను మళ్ళిస్తుందని ఆమె ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని పలు రాష్ట్రాలకు 4 కోట్ల ఇళ్లను కేటాయించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఎందుకు ఇళ్లను ఇవ్వడం లేదో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల విషయమై కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ను కలుస్తామన్నారు . ఇక టీడీపీతో మరోసారి జత కడతారా?, ఎన్నికల్లో ఉమ్మడిగా బరిలోకి దిగే అవకాశముందా అనే విశ్లేషణలు గట్టిగా వినిపిస్తున్న వేళ.. పొత్తులపై పార్టీ పెద్దలు చూసుకుంటారని పురంధేశ్వరి అన్నారు.. పరిస్థితులను బట్టి, హైకమాండ్ ఆదేశాలనుసారం ముందుకెళ్లనున్నట్టు పురంధేశ్వరి వెల్లడించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…