Puneeth Rajkumar : టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ వైవిధ్యమైన కథలని ఎంచుకుంటూ ప్రేక్షకులని అలరిస్తున్న విషయం తెలిసిందే. సింహాద్రి సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం ఆంధ్రావాలా. ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాగా, చిత్రం భారీ ఫ్లాప్ ను మూటగట్టుకుంది. సింహాద్రి సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కు మంచి ఫాలోయింగ్ పెరిగింది. నిమ్మకూరులో జరిగిన ఆంధ్రావాలా ఆడియో లాంచ్ కార్యక్రమానికి దాదాపు 10 లక్షల మంది అభిమానులు హాజరయ్యారు.
దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సులు, రైళ్లు నడిపినట్లు ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఇటీవల ఈ విషయాన్ని విన్న అలియా భట్ అవాక్కైంది. ఎన్టీఆర్ క్రేజ్ గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయింది. అయితే భారీ హైప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం దారుణంగా నిరాశపరచడంతో అభిమానుల కూడా డీలా పడ్డారు. అయితే ఈ సినిమాని ధైర్యంగా పునీల్ రాజ్ కుమార్ చేయడం విశేషం. ఆంధ్రావాలా సినిమా కన్నడ రీమేక్ లో పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించాడు. ఈ సినిమాతో కన్నడనాట బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇది అందరినీ ఆశ్చర్యపరచింది.
ఇక పునీత్- ఎన్టీఆర్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. పునీత్ సినిమాలో ఎన్టీఆర్ పాటలు కూడా పాడారు. పునీత్ హఠాన్మరణం ఎన్టీఆర్‌ని ఎంతగానో కలచివేసింది. రవితేజ హీరోగా నటించిన ఇడియట్ సినిమా రీమేక్ అప్పుతో పునీత్ హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధిచడంతో పునీత్ కు ఎంతో క్రేజ్ వచ్చింది. అంతే కాకుండా మహేశ్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమాను కూడా కన్నడలో రీమేక్ చేశాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…