Puli Meka Series : టాలీవుడ్ హీరోహీరోయిన్లు ఆదిసాయికుమార్ , లావణ్యత్రిపాఠి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇస్తూ నటించిన వెబ్‌సిరీస్ పులిమేక. కె చక్రవర్తి రెడ్డి దర్శకత్వం వహించిన ఈ వెబ్‌సిరీస్‌కు కోన వెంకట్ కథను అందిస్తూ స్వయంగా నిర్మించారు. సైకో కిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ వెబ్‌సిరీస్ ఇటీవల ఓటీటీలోకి వచ్చింది. సైకో కిల్లర్ కథాంశంతో పులిమేక వెబ్ సిరీస్ రూపొందింది. పోలీసులను టార్గెట్ చేసిన ఓ కిల్లర్ కథకు రివేంజ్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ జోడిస్తూ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్‌గా కోన వెంకట్, వెంకటేష్ కిలారు ఈ కథను రాసారు.
పులి మేక టీజర్, ట్రైలర్, గ్లింప్స్ ఇలా ప్రారంభం నుంచే క్యూరియాసిటీని క్రియేట్ చేసి వెబ్ సిరీస్‌పై ఆసక్తిని పెంచాయి. ఇప్పటికే ఈ క్రైమ్ థ్రిల్లర్ 100 మిలియన్స్ వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించి ఓటీటీ సూపర్ హిట్‌గా నిలిచినట్లుగా తాజాగా జీ 5 ఓటీటీ వర్గాలు వెల్లడించాయి. స్మార్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా పులి మేక ఆడియెన్స్‌ను కట్టి పడేసిందనే చెప్పాలి. సిరీస్‌లో ఉండే ట్విస్టులు, టర్న్‌లను ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా లావణ్య త్రిపాఠి , ఆది సాయికుమార్ పాత్రలు సహా ఎంటైర్ సిరీస్‌ను ఫ్యామిలీ అంతా కలిసి చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇందులో గోపరాజు రమణ, సిరి హన్మంత్, రాజా చెంబోలు, నోయెల్ సేన్ ముఖ్య పాత్రలు పోషించగా, వారు కూడా తమ పర్‌ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌ని మెప్పించారు. పులి మేక ఒరిజినల్ ఇంత బాగా రావటంలో షో రన్నర్‌గా, రైటర్‌గా కోన వెంకట్ తనదైన పాత్రను అద్భుతంగా పోషించారు అనే చెప్పాలి. ‘పులి మేక’ క్రైమ్ థ్రిల్లర్ ఫిబ్రవరి 23 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అవుతుండగా, దీనికి వస్తున్న రెస్పాన్స్ చూసి అందరు షాక్ అవుతున్నారు. ఫోరెన్సిక్ హెడ్‌గా జోవియల్ క్యారెక్టర్‌లో ఆదిసాయికుమార్ యాక్టింగ్ వెబ్ సిరీస్‌లో బాగుంది. పల్లవిగా సిరి హనుమంతు రోల్ చిన్నదే అయినా కథ మొత్తం ఆమె క్యారెక్టర్ నేపథ్యంలోనే సాగుతుంది. ఆది సాయికుమార్ తండ్రిగా గోపరాజు రమణ కూడా మెప్పించారు.